ETV Bharat / entertainment

రజనీకాంత్ జోరు - యంగ్​ డైరెక్టర్​తో మరో కొత్త సినిమాకు గ్రీన్​సిగ్నల్​! - Rajinikanth New Movie - RAJINIKANTH NEW MOVIE

Rajinikanth New Movie with Mari Selvaraj : సూపర్ స్టార్ రజనీ కాంత్‌ సినిమాల విషయంలో జోరు చూపిస్తున్నారు. ఇప్పుడాయన మరో కొత్త సినిమాకు గ్రీన్​ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. పూర్తి వివరాలు స్టోరీలో.

source ETV Bharat
Rajinikanth (source ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 23, 2024, 6:47 AM IST

Updated : Aug 23, 2024, 7:19 AM IST

Rajinikanth New Movie with Mari Selvaraj : సూపర్ స్టార్ రజనీ కాంత్‌ సినిమాల విషయంలో సూపర్​ ఫామ్​లో ఉన్నారు. వరుస సినిమాలు చేస్తూ కెరీర్​లో జోరు ప్రదర్శిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఈ దసరా పండక్కి 'వేట్టయాన్‌' చిత్రంతో ప్రేక్షకుల్ని పలకరించనున్న సంగతి తెలిసిందే. ఆ వెంటనే లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో 'కూలీ'తో రానున్నారు. ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణ దశలో ఉంది.

మరోవైపు జైలర్‌ 2ను సెట్స్​పైకి తీసుకెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు మరో కొత్త కథ విషయమై చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. ఓ యువ దర్శకుడితో చర్చలు జరుగుతున్నాయట. ఆయన మరెవరో కాదు 'కర్ణన్‌', 'మామన్నన్‌' చిత్రాలతో ఆడియెన్స్​ను అలరించిన దర్శకుడు మారి సెల్వరాజ్‌.

మారి సెల్వరాజ్​ ప్రస్తుతం రజనీ కాంత్​తో ఓ మూవీ చేసేందుకు కథా చర్చలు జరుపుతున్నారట. ఈ విషయాన్ని తాజాగా స్వయంగా ఆయనే చెప్పారు. "రజనీ కాంత్​కు నేను అంటే ఇష్టం. నా గత చిత్రాలు 'కర్ణన్‌', 'మామన్నన్‌' చూశారు. ఆ తర్వాత ఫోన్‌ చేసి ప్రత్యేకంగా అభినందించారు. మేమిద్దరం కలిసి ఓ చిత్రం చేయాలని అనుకుంటున్నాం. ప్రస్తుతానికైతే కథా చర్చలు జరుగుతున్నాయి" అని తెలిపారు మారి సెల్వరాజ్‌.

ప్రస్తుతం మారి సెల్వరాజ్​ తెరకెక్కించిన 'వాజై' చిత్రం రిలీజ్​కు రెడీ అవుతోంది. మరో సినిమా 'బైసన్‌' 70 శాతం షూటింగ్​ను పూర్తి చేసుకుంది.

Rajinikanth Vettaiyan Movie : ఇక రజనీ కాంత్ వేట్టయాన్ సినిమా విషయానికొస్తే 'జై భీమ్‌' సక్సెస్​ తర్వాత టి.జె.జ్ఞానవేల్‌ తెరకెక్కించిన పాన్‌ ఇండియా చిత్రమిది. లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ ప్రొడ్యూస్ చేసింది. అమితాబ్‌ బచ్చన్, ఫహాద్‌ ఫాజిల్, రానా తదితరులు కీలక పాత్రలు పోషించారు. దసరా కానుకగా అక్టోబరు 10న రిలీజ్ కానుంది.

Rajinikanth Coolie Movie : కూలి సినిమా విషయానికొస్తే లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఇది రజనీ 171వ చిత్రం. సన్‌ పిక్చర్స్‌ నిర్మిస్తోంది. అక్రమ రవాణా మాఫియా బ్యాక్​డ్రాప్​తో ఈ చిత్రం రూపొందుతున్నట్టు తెలుస్తోంది.

'దసరా' ధూమ్‌ధామ్‌ - థియేటర్లు దద్దరిల్లేలా ఐదు బడా సినిమాలు! - Dasara 2024 Box Office War

కేవలం రూ. 2 కోట్ల కలెక్షన్స్ - ఆ ఒక్క సినిమాతో రజనీ బీటౌన్ కెరీర్ డౌన్!

Last Updated : Aug 23, 2024, 7:19 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.