ETV Bharat / entertainment

ఆయన ఇల్లు వేలం - బాలీవుడ్‌ మొత్తం నవ్వుకుంది! ఇప్పుడేమో : రజనీ ఎమోషనల్ స్పీచ్ - Rajinikanth Emotional Speech

Rajinikanth Emotional Speech About Amitabh Bacchan: సూపర్ స్టార్ రజనీకాంత్, టాప్ మోస్ట్ డైరెక్టర్ జ్ణానవేల్ దర్వకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం వెట్టయాన్(వేటగాడు). ఈ సినిమాలో రజనీకాంత్ సహా బిగ్ బీ అమితాబ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా ఆడియో ఫంక్షన్​లో అమితాబ్ గురించి మాట్లాడుతూ బాగా ఎమోషనల్ అయ్యారు తలైవా. ఇంతకీ ఏమన్నారంటే?

Vettaiyan Audio Launch Event
Vettaiyan Audio Launch Event (Associated Press, ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 21, 2024, 7:13 PM IST

Rajinikanth Emotional Speech About Amitabh Bacchan : సూపర్ స్టార్ రజనీకాంత్, బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం 'వెట్టయాన్- ది హంటర్'. 'జై భీమ్' ఫేం డైరెక్టర్ టిజే జ్ణానవేల్ దర్వకత్వం వహిస్తున్న ఈ చిత్రం తెలుగులో వేటగాడు పేరుతో అక్టోబర్ 10, విడుదల కానుంది. తాజాగా చెన్నైలో ఈ సినిమా ఆడియో ఫంక్షన్ చాలా గ్రాండ్​గా జరిగింది. ఈ కార్యక్రమంలో అమితాబ్ గురించి మాట్లాడుతూ చాలా ఎమోషనల్ అయ్యారు రజనీకాంత్. ఇంతకీ ఏం జరిగిదంటే?

తాజాగా చెన్నైలో జరిగిన 'వెట్టయాన్' ఆడియో లాంచ్ కార్యక్రమంలో అమితాబ్ ఆర్థిక పరిస్థితుల గురించి ఆయన ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి మాట్లాడారు. "అమితాబ్ సినిమాలకు నిర్మాతగా వ్యవహరించిన సమయంలో భారీ నష్టాన్ని చవి చూశారు. అప్పడు కనీసం వాచ్​మెన్​కు జీవితం కూడా ఇవ్వలేని పరిస్థితి ఆయనకు వచ్చింది. జుహూలోని ఆయన ఇంటిని కూడా వేలం వేశారు. అప్పుడు బాలీవుడ్ మొత్తం అమితాబ్ చూసి నవ్వింది. ప్రపంచం ఎప్పుడూ నువ్వు పడిపోవడం కోసమే ఎదురుచూస్తుంది. కానీ తర్వాత మూడేళ్లలో అమితాబ్ పరిస్థితి మొత్తాన్ని మార్చేశారు. రకరకాల అడ్వటైజ్మెంట్​లు, కౌన్ బనేగా కరోడ్ పతి కార్యక్రమం ద్వారా ఎంతో డబ్బు సంపాదించారు. జుహులోని తన ఇంటితో పాటు అదే వీధిలో మరో రెండు ఇళ్లను కొనుగోలు చేసే స్థాయికి ఎదిగారు. ఆయన ఎంతో స్పూర్తిదాయకమైన వ్యక్తి". అంటూ చెప్పుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు సూపర్ స్టార్. 82 ఏళ్ల వయసులోనూ రోజుకు 10గంటలు పనిచేసే ఆదర్శనీయమైన వ్యక్తి అంటూ బచ్చన్ సాబ్ పై పొగడ్తల వర్షం కురిపించారు.

అంతేకాదు "అమితాబ్ తండ్రి మంచి రచయిత. ఆయన తలుచుకుంటే ఆ పరపతితో ఏదైనా చేయగలిగేవారు. కానీ కుటుంబం అండ ఏమాత్రం తీసుకోకుండా సొంతంగా కెరీర్​లో ఎదిగారు. ఒకసారి అమితాబ్​కు ఘోర ప్రమాదం జరిగింది. ఆ సమయంలో ఇందిరా గాంధీ విదేశాల్లో ఓ సదస్సుకు వెళ్లారు. యాక్సిడెంట్ గురించి తెలుసుకున్న ఆమె వెంటనే ఇండియాకు వచ్చారు. అప్పుడే అందరికీ తెలిసిన విషయం ఏంటంటే రాజీవ్ గాంధీ, అమితాబ్ జీ కలిసి చదువుకున్నారు." అంటూ చెప్పుకొచ్చారు సూపర్ స్టార్.

ఇక 'వెట్టయాన్' సినిమా విషయానికొస్తే ఇందులో సూపర్ స్టార్ పవర్ ఫుల్ పోలీసు ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నట్లు ఫ్టస్ట్ ఫ్రివ్యూ టీజర్ ద్వారా తెలుస్తోంది. ఇందులో అమితాబ్ కూడా కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. దసరా కానుకగా అక్టోబర్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ చిత్రంలో మంజు వారియర్, ఫహాద్ ఫాజిల్, రానా దగ్గుబాటి, రితికా సింగ్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

రజనీకాంత్ జోరు - యంగ్​ డైరెక్టర్​తో మరో కొత్త సినిమాకు గ్రీన్​సిగ్నల్​! - Rajinikanth New Movie

అమితాబ్ అభిమాని చేసిన పని - గుర్తించిన గూగుల్ మ్యాప్​! - Amitabh Bachan statue

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.