Rajamouli Premalu Movie Heroine : దర్శకధీరుడు రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ పేరు తెలియని సినీ ప్రేమికులు ఉండరేమో. ఇప్పటివరకు ఆయన తెరకెక్కించిన ప్రతీ సినిమా బాక్సాఫీస్ ముందు ఇండస్ట్రీ, బ్లాక్ బాస్టర్ హిట్టే. ఆయన తీసిన ప్రతీ చిత్రంలోనూ దాదాపుగా ఎమోషనల్, యాక్షన్ పక్కా ఉండాల్సిందే. అయితే సాధారణంగా యాక్షన్ చిత్రాలను ఇష్టపడే తనకు తాజాగా ఓ లవ్ స్టోరీ సినిమా నచ్చిందని అన్నారు జక్కన్న. అలానే అందులో నటించిన ఓ హీరోయిన్ను చూసి జక్కన్న ఫిదా అయిపోయారు! ఆమెపై ప్రశంసల వర్షం కురిపించారు.
తాజాగా ప్రేమలు సినిమా తెలుగు వెర్షన్ సక్సెస్ మీట్‌కు రాజమౌళి చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు. మ్యాథ్యూ థామస్, నస్లేన్ కె. గపూర్, మమిత బైజు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రమిది. గిరీశ్ ఎ.డి. దర్శకుడు. మలయాళంలో భారీ హిట్ అందుకున్న ఈ చిత్రాన్ని రాజమౌళి తనయుడు కార్తికేయ తెలుగులో డిస్ట్రిబ్యూట్ చేశారు. ఇక్కడ కూడా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సందర్భంగా విజయోత్సవ వేడుక నిర్వహించారు. ఇందులో జక్కన్నతో పాటు దర్శకులు అనిల్ రావిపూడి, అనుదీప్ కేవీ, సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి తదితరులు విచ్చేసి సందడి చేశారు.
ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ "కీరవాణి అన్నయ్య నీలగిరి చిత్రానికి వర్క్ చేస్తున్న సమయంలో మలయాళ పదం ఎందమాషే పదానికి అర్థం తెలుసుకున్నాను. నేను శాంతినివాసం ధారావాహికకు దర్శకత్వం వహించేటప్పుడు రచయిత పృథ్వీతేజను మాషే అని పిలిచే వాడిని. కొంతకాలం తర్వాత దాని అర్థం ఏంటని ఆయన అడిగారు. మాషే అంటే బాస్ అని చెప్పాను. దీంతో ఆయన నవ్వారు. అలా మలయాళంతో నాకు పరిచయం ఏర్పడింది. మా సిస్టర్స్ కూడా ఇద్దరు కేరళకు చెందిన వారినే పెళ్లి చేసుకున్నారు. ఇక సినిమాల్లో ప్రేమకథలు, రొమాంటిక్ కామెడీ చిత్రాలను నేను పెద్దగా ఇష్టపడను. యాక్షన్, ఫైట్లు అంటేనే ఇష్టం. ప్రేమలు చిత్రాన్ని ఇక్కడ కార్తికేయ రిలీజ్ చేసినప్పుడు కూడా అంతగా ఆసక్తి చూపలేదు. ఇంట్రెస్ట్ లేకుండానే థియేటర్ వెళ్లి సినిమా చూశాను. సినిమా చూస్తున్నంత సేపు నవ్వుతూనే ఉన్నాను. ఇది థియేటర్లలోనే చూడాలి. అసూయ, బాధతో చెబుతున్నాను. మలయాళీ యాక్టర్స్ అంతా చక్కగా నటిస్తారు. గిరిజ (గీతాంజలి ఫేమ్), సాయి పల్లవిలా ఈ సినిమా హీరోయిన్ మమిత కూడా ఎప్పటికీ ప్రత్యేకంగా నిలిచిపోతుంది" అని ప్రశంసలు కురిపించారు. రీసెంట్గా కూడా జక్కన్న మమిత పాత్రను ప్రశంసించారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
హనీమూన్ రోజే స్టార్ హీరోయిన్ను వేలం వేసిన భర్త - చిత్రహింసలు పెడుతూ నరకం!