ETV Bharat / entertainment

SSMB 29 షూటింగ్ ఫస్ట్ షెడ్యూల్​ - ఆ దేశంలో ప్లాన్ చేస్తున్న రాజమౌళి! - SSMB 29 Movie Shooting f - SSMB 29 MOVIE SHOOTING F

Rajamouli Mahesh Babu SSMB 29 Movie Shooting : మహేశ్ - రాజమౌళి SSMB 29 సినిమా షూటింగ్​కు సంబంధించి ఓ అప్డేట్ బయటకు వచ్చింది. పూర్తి వివరాలు స్టోరీలో

source ETV Bharat
Mahesh Rajamouli (source ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 16, 2024, 3:04 PM IST

Rajamouli Mahesh Babu SSMB 29 Movie Shooting : దర్శక ధీరుడు రాజమౌళి - సూపర్ స్టార్ మహేశ్​ బాబు SSMB 29 సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం ఎప్పుడెప్పుడు షురూ అవుతుందా అని మహేశ్​ ఫ్యాన్స్​తో పాటు సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇదే సమయంలో సినిమాపై మొదటి నుంచి చాలా రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి.

ఈ క్రమంలోనే తాజాగా మరో క్రేజీ అప్డేట్​ బయటకు వచ్చింది. డిసెంబర్​లో ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని తెలిసింది. మొదటి షెడ్యూల్ షూటింగ్​ను జక్కన్న జర్మనీలో ప్లాన్ చేస్తున్నారట. ఈ షెడ్యూల్​కు సంబంధించి త్వరలోనే యూనిట్​ సభ్యులందరికు వర్క్ షాప్ నిర్వహిస్తారని సమాచారం. త్వరలోనే సినిమాకు సంబంధించిన అఫీషియల్​ అనౌన్స్​మెంట్​ వచ్చే అవకాశముంది.

కాగా, ఈ చిత్రాన్ని హాలీవుడ్ రేంజ్​లో జేమ్స్ బాండ్ తరహాలో రూపొందించనున్నారని మొదటి నుంచి టాక్ వినిపిస్తోంది. 2027 జనవరిలో సినిమా విడుదల చేస్తారని టాక్. చిత్రంలో ప్రముఖ ఇండోనేషియన్ బ్యూటీ చెల్సియా ఇస్లాన్ హీరోయిన్​గా నటించే అవకాశముందని ఆ మధ్య జోరుగా ప్రచారం సాగింది. మరి ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే ఇంకొంత కాలం వేచి ఉండాల్సిందే.

ఆ మధ్య జక్కన్న తండ్రి, రచయిత విజయేంద్రప్రసాద్‌ ఈ సినిమా కథ గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. తాను, రాజమౌళి సౌతాఫ్రికా నవలా రచయిత విల్బర్‌ స్మిత్​కు పెద్ద అభిమానులం అని చెప్పారు. అందుకే ఆయన పుస్తకాల ఆధారంగానే ఈ SSMB 29 సినిమా స్క్రిప్ట్​ను రాసినట్లు చెప్పుకొచ్చారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సినిమా అమెజాన్ ఫారెస్ట్ బ్యాక్​ డ్రాప్​లో అడ్వెంచర్ థ్రిల్లర్​గా ఉండబోతుంది.

ఇండియన్ లాంగ్వేజెస్​తో పాటు, విదేశీ భాషల్లోనూ ఈ SSMB 29ను రిలీజ్ చేయనున్నారు. దుర్గా ఆర్ట్స్‌పై కె.ఎల్‌.నారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీలో మహేశ్ సరికొత్త లుక్‌లో కనిపించనున్నారు. ఆ పాత్ర కోసం మహేశ్​ ఇప్పటికే సన్నద్ధమయ్యారు.

ఒక్కటైన సిద్ధార్థ్‌, అదితి - పెళ్లి ఫొటోలు వైరల్‌ - Siddharth Aditi Rao Hydari Marriage

పవన్‌, మహేశ్‌ ఎవరి సినిమాలో నటిస్తారు? - ఖుష్బూ ఏం చెప్పారంటే? - Actress Kushboo Sundar

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.