Rajamouli Gaami Movie : మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ప్రస్తుతం 'గామి' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. కొత్త డైరెక్టర్ విద్యాధర్ కాగిత తెరకెక్కించిన ఈ మూవీ మార్చి 8న థియేటర్లలో సందడి చేయనుంది. ఇటీవలే విడుదలైన ట్రైలర్ ఈ సినిమా పై భారీ అంచనాలు పెంచేసింది. ఆద్యంతం ఎంతగానో ఆకట్టుకున్న ఆ గ్లింప్స్ వీడియోపై ఎంతో మంది ప్రముఖులు తమ అభిప్రాయాలు వెల్లడించారు. ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.
తాజాగా ప్రముఖ డైరెక్టర్ రాజమౌళి కూడా ఈ ట్రైలర్ గురించి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. "కఠోరమైన కృషి ఉంటే అసాధ్యమైన కలలు కూడా సాకారమవుతాయి. 'గామి' గురించి డైరెక్టర్, ప్రొడ్యూసర్ ఎంత కష్టపడ్డారో నాతో చెప్పినప్పుడు ఈ మాట నాకు గుర్తొచ్చింది. ఇందులోని విజువల్స్ చూస్తే నాలుగేళ్ల నుంచి వాళ్లు ఎంతగా కష్టపడ్డారో నాకు అర్థమైంది" అంటూ మూవీ టీమ్‌కు విషెస్ తెలిపారు.
Gaami Movie Cast : ఇక 'గామి'లో విశ్వక్సేన్ డిఫరెంట్ గెటప్‌లో కనిపించారు. దీంట్లో శంకర్ అనే అఘోరాగా కనిపిస్తారు. అంతే కాకుండా ఇందులో మానవ స్పర్శను తట్టుకోలేని ఓ మనిషిలా కనిపించనున్నారంటూ మేకర్స్ ఇటీవలే వెల్లడించారు. దీంతో పాటు ఈ చిత్రంలో విశ్వక్‌కు మరో రెండు భిన్నమైన గెటప్‌లు ఉంటాయని సమచారం.
ఇక విశ్వక్‌తో పాటు పాటు 'కలర్ ఫొటో' ఫేమ్ చాందిని చౌదరి హీరోయిన్‌గా నటించారు. ఎం జి అభినయ, హారిక పెడాడ, మహ్మద్ సమద్, దయానంద్ రెడ్డి, హారికా కీలక పాత్రలు పోషించారు. కార్తీక్ కుల్ట్ క్రియేషన్స్‌పై కార్తీక్ శబరీష్ ఈ సినిమాకు నిర్మతగా వ్యవహరించారు. తాజాగా ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. నరేశ్ కుమారన్ సంగీతం అందించగా, విశ్వనాథ్ రెడ్డి సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి 'ఏ' సర్టిఫికెట్ ఇచ్చినట్లు తెలుపుతూ నిర్మాణ సంస్థ తాజాగా ఓ స్పెషల్ పోస్టర్‌ను కూడా విడుదల చేసింది. మరోవైపు ఈ సినిమా రన్‌టైమ్ 2:26 నిమిషాలు ఉంటుందని సినీ వర్గాల సమాచారం.
'షూటింగ్లో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పరిగెత్తా' - బాలయ్య NBK109 భామ
'ఆ సమయంలో చాందినీని చూసి భయపడ్డా - ఇకపై అటువంటి సాహసాలు చేయను'