Rajamouli Documentary Netflix: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళిపై ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ 'మోడ్రన్ మాస్టర్స్: ఎస్‌ఎస్ రాజమౌళి' అనే పేరుతో ఒక డాక్యుమెంటరీని రూపొందించింది. ఈ డాక్యుమెంటరీ ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. సాధారణంగా సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలు అంటే అందరికీ ఎక్కడలేని ఆసక్తి. సరిగ్గా అలాంటి అన్ని అంశాలను ఇందులో తెలియజేసినందువల్లే ఈ డాక్యుమెంటరీ క్రేజ్ మరింత పెరిగిపోయింది. ఇందులో రాజామౌళి వ్యక్తిగత జీవితం, సినీ కెరీర్, ఈ క్రమంలో ఆయనకు ఎదురైన పరిస్థితులు అన్నీ వివరంగా చూపించారు.
'బాహుబలి', 'RRR' వంటి బ్లాక్‌బస్టర్‌లు అందించిన రాజమౌళి వ్యక్తిగత జీవితం కచ్చితంగా ఆసక్తికరంగా ఉంటుందనే అభిప్రాయం ఎక్కువ. ఎందుకంటే జక్కన్న కెరీర్‌లో సపోర్ట్‌గా నిలిచి, ఆయన చిత్రాలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేసిన రమా రాజమౌళితో వివాహం హాట్ టాపిక్. చాలా మందికి అంతో ఇంతో తెలిసిన విషయమే అయినా రమా రాజమౌళి తమ వివాహాన్ని కూడా ఈ డాక్యుమెంటరీలో వివరించారు. ఒక పిల్లవాడితో ఉండగా తాను విడాకులు తీసుకున్న విషయాన్ని రమ ఇందులో స్వయంగా వెల్లడించారు.
ఈ విషయం గురించి ఆమె కుమారుడు కార్తికేయ మాట్లాడుతూ, రాజమౌళిని తాను అంకుల్ అని పిలిచిన రోజులు తనకు ఇప్పటికీ గుర్తున్నాయని అన్నాడు. ఒక స్టార్ డైరెక్టర్ తన కుటుంబానికి సంబంధించిన ఓకే సున్నితమైన విషయాన్ని అభిమానులకు స్వయంగా చెప్పటం ఈ డాక్యుమెంటరీకే హైలైట్. నిజానికి ఈ ఎపిసోడ్ రాజమౌళి కుటుంబాన్ని మరో మెట్టు పైకి తీసుకు వెళ్ళి అభిమానులకు మరింత దగ్గర చేసింది.
తెలుగు సినిమా స్థాయి పెంచిన దర్శకుడి గురించి తెలుసుకోవాలని అందరికీ ఆతృతగానే ఉంటుంది. అందుకే ఈ డాక్యుమెంటరీ రిలీజ్ అయినప్పటినుంచి ట్రెండింగ్‌లో ఉంది. నిజానికి ఇందులో కొన్ని విషయాలు ప్రేక్షకులకు తెలిసినవే, అయినా మరికొన్ని విషయాలు కూడా ఉన్నాయి. రాజమౌళి ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి కీరవాణి, విజయేంద్ర ప్రసాద్ చెప్పారు. వాటన్నింటి మధ్య రాజమౌళి ఎలా ఎదిగారో కూడా వివరించారు. నిజానికి తన వ్యక్తిగత జీవితాన్ని అభిమానులతో షేర్ చేసుకోవడానికి రాజమౌళి తీసుకున్న నిర్ణయం చలనచిత్ర పరిశ్రమలో ఒక కొత్త పద్ధతి. చాలామంది నటులు, దర్శకులు తమ వ్యక్తిగత జీవితాలను ఎవరితోనూ పంచుకోవటానికి ఇష్టపడరు. ఈ విధంగా వ్యక్తిగత జీవితం గురించి ఒక డాక్యుమెంటరీ రూపొందించటం రాజమౌళికే చెల్లింది.
రాజమౌళి లాంటి పిచ్చోడిని చూడలేదు! : ప్రభాస్ - Netflix Rajamouli Documentary