Rajamouli About SSMB 29 : సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనున్న మూవీ 'SSMB 29'. దర్శక ధీరుడు రాజమౌళి దీన్ని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ సినిమా గురించి రోజుకో అప్డేట్ నెట్టింట ట్రెండ్ అయ్యి అభిమానులను ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలో మూవీకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త వైరల్ అవుతోంది. అదేంటంటే?
'ఆర్ఆర్ఆర్' కంటే ఎక్కువ జంతువులు'
ఓ ఇంటర్నేషనల్ ప్రెస్ మీట్లో రాజమౌళి ఇటీవలే మాట్లాడిన మాటలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 'ఆర్ఆర్ఆర్' కంటే ఎక్కువ జంతువులను తన తదుపరి చిత్రాల్లో చూపిస్తానని జక్కన్న వ్యాఖ్యానించారు. దీంతో 'SSMB 29'లో రాజమౌళి జంతువులతో మంచి ఫైట్స్ లేదా సీన్స్ తెరకెక్కిస్తారని మహేశ్ ఫ్యాన్స్ ఖుషీ అయిపోతున్నారు.
I'm Pretty Sure I will use Animals Even more than #RRR in My Next Film #SSMB29 - @ssrajamouli 🔥🔥🔥#MaheshBabu @urstrulyMahesh pic.twitter.com/enodV4MoVh
— Mahesh Babu News🦁 (@MaheshBabuNews) October 21, 2024
ఇంటర్వెల్ సీన్ అదుర్స్
'ఆర్ఆర్ఆర్' ఇంటర్వెల్ ఎపిసోడ్లో జూనియర్ ఎన్టీఆర్‌కు సంబంధించిన ఓ సీన్ నెట్టింట తెగ ట్రెండ్ అయ్యింది. వ్యాను బోనులో జంతువులను దించుతూ తారక్ ఎగిరే సీన్ ఏ స్థాయిలో వైరల్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాగే పులులతో రామ్ చరణ్, ఎన్టీఆర్ పోరాడిన తీరు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇవి కాకుండా పులితో యంగ్ టైగర్ ఇంట్రో ఫైట్ కూడా అదిరిపోయింది. ఇప్పుడు ఏకంగా తన తదుపరి సినిమాల్లో ఎక్కువ జంతువులను చూపిస్తానని అనడం వల్ల ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మరింత అంచనాలు పెరిగిపోయాయి.
వచ్చే ఏడాది షూటింగ్ ప్రారంభం
కాగా, ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభం కానుందని రాజమౌళి తండ్రి, రైటర్ విజయేంద్ర ప్రసాద్ రీసెంట్గా ఓ కార్యక్రమంలో పేర్కొన్నారు. ఈ స్టోరీ రాసేందుకు తనకు దాదాపు రెండేళ్ల సమయం పట్టిందని తెలిపారు. ఇక హీరో మహేశ్ కూడా ఈ సినిమా కోసం మేకోవర్ అవుతున్నారు. పాత్ర కోసం పొడవాటి జుట్టు, గడ్డంతో రెడీ అవుతున్నారు. అంతేకాకుండా ఈ పాత్ర కోసం మహేశ్ కొన్ని రోజులుగా జిమ్‌లో సాధనలు చేస్తున్నారు. ఈ మధ్య ఆ ఫొటోలు కూడా వైరల్ అయ్యాయి.
ఇక ఈ సినిమాలో మహేశ్‌ను ఓ సరికొత్త అవతార్‌లో చూపించనున్నారు. అమెజాన్ అడవుల నేపథ్యంలో సాగే ఈ కథలో పలువురు హాలీవుడ్ నటులు కూడా నటించనున్నారు. దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కేఎల్ నారాయణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 'గరుడ' అనే టైటిల్ అనుకుంటున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది. దర్శకధీరుడు రాజమౌళి- మహేశ్ కాంబోలో వస్తున్న తొలి సినిమా ఇదే. దీనిపై భారీగా అంచనాలున్నాయి.
మహేశ్, రాజమౌళి మూవీ అప్డేట్- SSMB29 ఒకటి కాదు రెండు పార్ట్‌లుగా?
SSMB 29 షూటింగ్ ప్రారంభం అప్పుడే - అప్డేట్ ఇచ్చిన విజయేంద్ర ప్రసాద్