ETV Bharat / entertainment

టాలీవుడ్ హీరో మంచి మనసు - నెలకు నాలుగున్నర లక్షల ఫుడ్ ఫ్రీగా పంచుతూ! - Tollywood Hero Free Food Delivery - TOLLYWOOD HERO FREE FOOD DELIVERY

తాజాగా ఓ టాలీవుడ్ హీరో మంచి మనసు బయటపడింది. ఆయన పేద ప్రజల కోసం నెలకు నాలుగున్నర లక్షల విలువ చేసే ఆహారాన్ని ఉచితంగా పంచుతున్నారట. ఇంతకీ ఆయన ఎవరంటే?

Source Getty Images and ETV Bharat
Sandeep Kishan (Source Getty Images and ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jul 24, 2024, 5:05 PM IST

Sandeep Kishan Free Food Delivery : చాలా మంది సినీ సెలబ్రిటీలు ఓ వైపు కోట్ల రూపాయలు సంపాదిస్తూనే మరోవైపు ఏదో ఒకరంగా సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉంటారు. ఎంతో మంది ఆదుకుంటుంటారు. అయితే వీరిలో కొంత మంది చెప్పుకుంటారు. మరికొంతమంది చెప్పుకోరు. తాజాగా హీరో సందీప్ కిషన్ చాలా కాలంగా తాను చేస్తున్న ఓ మంచి పని గురించి అనుకోకుండా మీడియా ముందు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ విషయం బయట మీడియా కథనాల్లో చక్కర్లు కొడుతోంది.

అదేంటంటే? - ప్రస్తుతం సందీప్ కిషన్ కోలీవుడ్ స్టార్ హీరో ధనుశ్​ నటించిన రాయన్(Dhanush Raayan Movie) సినిమాలో ఓ కీలక పాత్ర పోషించారు. జులై 26న సినిమా విడుదల కానుంది. తాజాగా ఈ మూవీ ప్రమోషన్స్​లో భాగంగా సందీప్ కిషన్ మీడియాతో ముచ్చటించారు. ఈ క్రమంలో తాను చేసే మంచి పని గురించి మాట్లాడారు.

సందీప్ కిషన్​కు పలు రెస్టారెంట్స్ ఉన్న సంగతి తెలిసిందే. రీసెంట్​గా ఆయన రెస్టారెంట్​లపై ఫుడ్ సేఫ్టీ అధికారుల రైడ్ జరిగింది. దీనిపై సోషల్ మీడియాలో రకరకాల కథనాలు వచ్చాయి. ఈ విషయమై తాజాా ప్రమోషన్స్​లో ఆయనకు ప్రశ్న ఎదురైంది. అప్పుడు సందీప్ మాట్లాడుతూ తాను ఈ రెస్టారెంట్ల ద్వారా ప్రతిరోజు ఉచితంగా 350 మందికి ఫుడ్ డొనేట్ చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు.

ఆశ్రమాలకు, పేదలకు తాను ఈ రెస్టారెంట్ ద్వారా ఆహారం పంచుతున్నట్లు వెల్లడించారు. ప్రతిరోజు తనకున్న ప్రతి బ్రాంచ్(7) నుంచి 50 మందికి అంటే రోజుకు 350 మందికి ఉచితంగా భోజనం సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. అలా దాదాపు నెలకు నాలుగున్నర లక్షల విలువ చేసే ఆహారాన్ని ఫ్రీగా పంచి పెడుతున్నట్లు చెప్పుకొచ్చారు.

అలానే అన్న క్యాంటీన్స్ తరహాలో తక్కువ ధరకే క్యాంటీన్స్ పెట్టాలనే ఆలోచన కూడా ఉన్నట్టు, ప్రస్తుతం దాని గురించి వర్క్​ చేస్తున్నట్టు చెప్పారట సందీప్ కిషన్. ఇక ఈ విషయం తెలుసుకుంటున్న సినీ ప్రియులు, అభిమానులు, ప్రజలు సందీప్ కిషన్ చేస్తున్న మంచి పనిని అభినందిస్తున్నారు. ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

తెలుగులోకి వచ్చేసిన అదిరిపోయే​ మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ - మతిపోయేలా క్లైమాక్స్​ ట్విస్ట్​! - Shakhahaari Movie OTT

బాలయ్య 'BB4' కోసం క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.