Malayalam Blockbuster Movies 2024 : ప్రస్తుతం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మలయాళం సినిమాలకు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఎందుకంటే అక్కడి నుంచి వచ్చే ప్రతీ సినిమా భారీగా వరుస విజయాలను అందుకుంటూ పోతున్నాయి. ఇప్పటికే ఈ ఏడాదిలో విడుదలైన బ్రహ్మయుగం, మంజుమ్మల్ బాయ్స్, ప్రేమలు, ఆడు జీవితం, ఆవేశం మంచి వసూళ్లను ఖాతాలో వేసుకున్నాయి. దాదాపుగా ఈ చిత్రాలన్నీ రూ.100కోట్లకుపైగా వసూళ్లను అందుకున్నాయి. తాజాగా ఈ విషయంపై మలయాళ స్టార్ హీరో, పుష్ప విలన్ ఫహాద్ ఫాజిల్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు.
"ఈ సంవత్సరం మలయాళం చిత్రాలు భారీ వసూళ్లను సాధించడం ఎంతో సంతోషంగా ఉంది. రిలీజైన ప్రతీ చిత్రం ప్రేక్షకాదరణ పొందుతోంది. అందుకు ప్రధాన కారణం కంటెంట్ భిన్నంగా ఉండటమే అని చెప్పగలను. కొత్త కథలను చూసేందుకు ఆడియెన్స్ థియేటర్లకు తరలి వస్తున్నారు. ఇప్పుడు దర్శక నిర్మాతలంతా కూడా ఎంతో ఉత్సాహంగా పని చేస్తూ ముందుకెళ్తున్నారు. కొత్త ప్రయోగాలు చేసేందుకు కూడా ఇదే సరైన సమయం అని నేను అనుకుంటున్నాను. నిర్మాతలకు నేనిచ్చే అడ్వైస్ ఒక్కటే. వచ్చే ఐదేళ్లలో ఏదైనా ట్రై చేయండి. డైలాగులు, మ్యూజిక్ లేకుండా కూడా సినిమా తీయండి. లేదంటే బ్లాక్ అండ్ వైట్‌లో కొత్తగా సినిమాను రూపొందించండి. దేనికీ వెనకడుగు వేయొద్దు. భయపడొద్దు. ప్రజలు మన పరిశ్రమను ఆదరించేందుకు రెడీగా ఉన్నారు. ప్రతీ చిత్రం రూ.100కోట్ల క్లబ్‌లో చేరడమే లక్ష్యంగా కంటెంట్ ఉన్న అర్థవంతమైన సినిమాలను ప్రేక్షకులకు ఇద్దాం" అని అన్నారు.
కాగా, ఫహాద్ ఫజిల్ ప్రస్తుతం ఓ వైపు హీరోగా రాణిస్తూనే ఇతర భాష చిత్రాల్లో కీలక పాత్రలు పోషిస్తున్నారు. తెలుగు, తమిళంలోని స్టార్ హీరోల సినిమాల్లోనూ నటస్తున్నారు. ఇప్పటికే పుష్ప, నాయకుడు, విక్రమ్ సహా పలు చిత్రాల్లో చేశారు. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతోన్న పుష్ప2లో ఎస్పీ భన్వర్‌సింగ్ షెకావత్‌గా మరోసారి అలరించనున్నారు. ఫస్ట్ పార్ట్‌తో పోలిస్తే సెకండ్ పార్ట్‌లో ఆయన పాత్ర నిడివి మరింత ఎక్కువగా ఉండనుంది. హీరోకు, ఆయన పాత్రకు మధ్య చాలా యాక్షన్ సన్నివేశాలు కూడా ఉండనున్నాయని మూవీటీమ్ చెబుతోంది. ఇంకా రజనీకాంత్ హీరోగా టి.జె.జ్ఞానవేల్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న వేట్టయాన్‌లోనూ ఓ కీలకపాత్ర చేస్తున్నారు.
ప్రశాంత్ వర్మ సూపర్ అప్డేట్ - డ్రాగన్‌తో జై హనుమాన్ పోరాటం! - Prasanth Varma Jai hanuman
బాలయ్యను ఢీ కొట్టేందుకు సెట్లోకి అడుగుపెట్టేసిన హంటర్ - NBK 109 Villain