Pushpa 2 Shooting Update : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న చిత్రం పుష్ప 2 : ది రూల్. రష్మిక హీరోయిన్గా నటిస్తోంది. అయితే ఈ సినిమా ముందుగా అనుకున్న ప్రకారం ఆగస్టు 15న రిలీజ్ కాకుండా డిసెంబర్ 6కు వాయిదా పడింది. అయితే ఇప్పుడు డిసెంబర్ 6 నుంచి కూడా వాయిదా పడే అవకాశం ఉందని, దర్శకుడు సుకుమార్ - హీరో అల్లు అర్జున్ మధ్య క్రియేటివ్ డిఫరెన్స్‌లు వచ్చాయని ప్రచారం సాగుతోంది.
Alluarjun Sukumar Creative Differences : అయితే దీనిపై మూవీటీమ్ అధికారికంగా ప్రకటించలేదు కానీ అవన్నీ ఊహాగానాలేనని సినిమాకు సంబంధించిన సన్నిహిత వర్గాలు తెలిపాయి. పుష్ప 2 చిత్రీకరణకు తాత్కాలిక విరామం మాత్రమేనని చెప్పాయి. ఈనెల 22 లేదా 25 నుంచి షూటింగ్ తిరిగి ప్రారంభంకానుందట.
జులై 28 నుంచి అల్లు అర్జున్ షూటింగ్లో పాల్గొనున్నారట. ఇప్పటి వరకూ చిత్రీకరించిన ఫుటేజ్‌కు సంబంధించి కొంత ఎడిటింగ్ పార్ట్‌కు ఇచ్చారట. అందుకే ఈ తాత్కాలిక బ్రేక్ అని తెలిసింది. అలానే దర్శకుడు సుకుమార్ కూడా వ్యక్తిగత పనుల మీద యూఎస్‌కు వెళ్లి వచ్చారు. ఆయనతో పాటు గీత రచయిత చంద్రబోస్ కూడా అక్కడికే వెళ్లారు. ఇప్పటికే వీరిద్దరి మధ్య ఐటమ్ సాంగ్‌కు సంబంధించిన చర్చలు కూడా జరిగాయని తెలిసింది.
ప్రస్తుతం సుకుమార్ తమ తర్వాతి షెడ్యూల్‌కు సంబంధించిన స్క్రిప్ట్‌నకు తుది మెరుగులు తీర్చిదిద్దడంతో బిజీగా ఉన్నారట. అలాగే కీలక సన్నివేశాలకు సంబంధించిన రిహార్సల్స్ కూడా జరుగుతున్నాయని సమాచారం అందింది. ఎట్టి పరిస్థితుల్లో డిసెంబరు(Pushpa 2 Release Date) నాటికి చిత్రాన్ని తీసుకురావాలని మూవీటీమ్ గట్టిగా ప్రయత్నాలు చేస్తోందట.
దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో దాదాపు రూ.500 కోట్లతో(Pushpa 2 Budget) నిర్మిస్తోంది. మలయాళ స్టార్ ఫహద్ ఫాజిల్, కమెడియన్ సునీల్, యంకర్ కమ్ యాక్ట్రెస్ అనసూయ, విలక్షణ నటుడు రావురమేశ్, ధనుంజయ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఘట్టమనేని వారి వివాహ ఆహ్వానము - అందరూ ఆహ్వానితులే! - Ghattamaneni Wedding Invitation