ETV Bharat / entertainment

'పుష్ప 2'కి నేనే కాదు, చాలా మంది మ్యూజిక్ డైరెక్టర్లు వర్క్ చేస్తున్నారు : తమన్ - PUSHPA 2 MUSIC UPDATE

'పుష్ప 2'కి చాలా మంది వర్క్ చేస్తున్నారు : తమన్

Pushpa 2 Music Update SS Thaman
Pushpa 2 Music Update SS Thaman (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 15, 2024, 12:46 PM IST

Pushpa 2 Music Update : మూవీ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పుష్ప 2 రిలీజ్​కు కౌంట్​డౌన్ స్టార్ట్ అయ్యింది. విడుదలకు ఇంకొద్ది రోజులే ఉన్న తరుణంలో అభిమానులకు ఈ సినిమా గురించి మరిన్ని అప్డేట్స్​ కోసం తెగ వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఇచ్చిన అప్డేట్ ప్రస్తుతం నెటిజన్లలో తెగ ఆసక్తి పెంచుతోంది. ఇంతకీ అదేంటంటే?

గత కొంతకాలంగా పుష్ప సినిమాకు తమన్​తో పాటు మరో ఇద్దరు కూడా బ్యాక్​గ్రౌండ్ మ్యూజిక్ పనులు చూసుకుంటున్నారన్న వార్తలు నెట్టింట చక్కర్లు కొట్టాయి. ఈ విషయం గురించి తమన్ తాజాగా క్లారిటీ ఇచ్చారు. బాలకృష్ణ డాకు మహారాజ్ టీజర్ లాంచ్ ఈవెంట్​లో అసలు విషయాన్ని రివీల్ చేశారు. 'పుష్ప 2'లో తాను ఒక భాగమేనని, ఆ సినిమా కోసం మిగతా మ్యూజిక్ డైరెక్టర్లు కూడా వర్క్ చేస్తున్నారని అన్నారు. అయితే వారెవరో చెప్పలేదు.

ఇదిలా ఉండగా, గతంలో ఈ లిస్ట్​లో అజనీష్ లోకనాథ్, సామ్ సిఎస్ పేర్లు వినిపించాయి. ఇప్పుు తమన్ చెప్తుంది చూస్తుంటే వీరే ఆ మ్యూజిక్ డైరెక్టర్లు అయ్యుండచ్చని అభిమానులు అంటున్నారు. ఇంకా క్లారిటీ కావాలంటే అఫీషిల్ అప్​డేట్ వచ్చేంతవరకూ వెయిట్ చేయాల్సిందే అని నెటిజన్లు అంటున్నారు.

ఇక పుష్ప సినిమా విషయానికి వస్తే, ఎర్రచందనం స్మగ్లింగ్‌ బ్యాక్​డ్రాప్​లో డైరెక్టర్ సుకుమార్‌ ఈ సినిమాను భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే వచ్చిన 'పుష్ప ది రైజ్‌' బాక్సాఫీస్ వద్ద సూపర్ సక్సెస్ సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దీనికి సీక్వెల్​గా 'పుష్ప ది రూల్' రూపొందుతోంది. ఓ సాధారణ క కూలీగా ప్రయాణం ప్రారంభించి ఎర్రచందనం సిండికేట్‌ను శాసించే రేంజ్​కు ఎదిగిన పుష్ప గురించి పార్ట్‌ 1లో చూపించారు. పుష్ప రాజ్‌గా బన్నీ ఊరమాస్‌ యాక్షన్‌, అలాగే శ్రీవల్లి పాత్రలో రష్మిక నటన ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ప్రమోషనల్ పోస్టర్స్ అభిమానులను తెగ ఆకట్టుకుని సినిమాపై భారీ అంచనాలు పెంచుతున్నాయి.

'చాలా బాధగా ఉంది' - 'పుష్ప 2' గురించి మాట్లాడిన రష్మిక

'శ్రీ వల్లి క్యారెక్టర్ కోసం బాగా రీసెర్చ్ చేశా' - 'పుష్ప' లుక్ టెస్ట్​లో రష్మిక ఎలా ఉందో చూశారా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.