ETV Bharat / entertainment

ఆల్​టైమ్ రికార్డ్- 'RRR'ను దాటేసిన 'పుష్ప'- ఒక్కరోజే రూ.300 కోట్లు! - PUSHPA 2 RECORD COLLECTION

బాక్సాఫీస్ వద్ద పుష్ప రూలింగ్ - ఇండియన్ సినిమా హిస్టరీలోనే హైయ్యెస్ట్ కలెక్షన్లు

Etv Bharat
Etv Bharat (Source : ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 6, 2024, 6:51 PM IST

Pushpa 2 Record Collection Worldwide : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ - సుకుమార్‌ కాంబోలో తెరకెక్కిన 'పుష్ప 2' ఇండియన్ సినిమా హిస్టరీలోనే రికార్డు క్రియేట్ చేసింది. తొలి రోజు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.294 కోట్లు వసూలు చేసినట్లు మేకర్స్ అధికారికంగా తెలిపారు. ఈ క్రమంలో ఇప్పటివరకు డే 1 అత్యధిక వసూళ్లుగా ఉన్న ఆర్ఆర్ఆర్ (రూ. 224 కోట్లు) రికార్డ్ బ్రేక్ అయ్యింది. అలాగే పుష్ప బాలీవుడ్​లోనూ అరుదైన రికార్డు నెలకొల్పింది.

బాలీవుడ్​లో పుష్ప రూలింగ్
హిందీ వెర్షన్‌లో పుష్ప-2 అదరగొడుతోంది. ఏకంగా తొలిరోజు రూ.72 కోట్లు నెట్ వసూల్ చేసినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. దీంతో బాలీవుడ్​లో తొలి రోజు అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా పుష్ప రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ క్రమంలోనే షారుక్ ఖాన్ 'జవాన్‌' తొలి రోజు రికార్డు క్రాస్ చేసింది. జవాన్ తొలి రోజు రూ.65.5 కోట్ల కలెక్షన్లు సాధించగా, పుష్ప-2 రూ.72కోట్లు కొల్లగొట్టింది. అంటే ఏ స్థాయిలో పుష్ప రూలింగ్‌ కొనసాగుతోందో అర్థం చేసుకోవచ్చు.

బాలీవుడ్​లో డే 1 టాప్ కలెక్షన్లు

  • పుష్ప 2- రూ.72కోట్లు
  • జవాన్-రూ.65.5 కోట్లు
  • స్త్రీ- రూ.55.4కోట్లు
  • పఠాన్- రూ. 55కోట్లు
  • యానిమల్- రూ.54.75కోట్లు
  • కేజీఎఫ్ 2- రూ.53.95కోట్లు
  • వార్- రూ. 51.60కోట్లు
  • థగ్స్ ఆఫ్ హిందూస్థాన్-రూ.50.75కోట్లు

తగ్గనున్న టికెట్ రేట్!
తెలుగు రాష్ట్రాల్లోనూ పుష్ప-2 మేనియా కొనసాగుతోంది. రికార్డు స్థాయిలో వసూళ్లు నమోదు అవుతున్నాయి. తొలి రోజు చాలా షోలు హౌస్‌ ఫుల్‌ అయ్యాయి. కానీ, రెండో రోజు నుంచి ఆక్యుపెన్సీ తగ్గినట్లుగా తెలుస్తోంది. సినిమాకి సూపర్‌ హిట్‌ టాక్ వస్తే ప్రతి షో హౌస్‌ ఫుల్‌ కావాలి. ప్రేక్షకులు సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు, సినిమాను చూడాలనే ఆసక్తి కనబరుస్తున్నారు. కానీ, టికెట్ల రేట్లు చూసి ప్రేక్షకులు కాస్త ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.

అదే కారణమా?
మల్టీప్లెక్స్‌లో ఇద్దరు సినిమాను చూడాలంటే దాదాపుగా రూ. వెయ్యికిపైనే ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇక ఫ్యామిలీ అంతా వెళ్తే ఇతర ఖర్చులతో కలిపి ఏ స్థాయిలో ఖర్చు ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అందుకే సగటు మధ్య తరగతి ప్రేక్షకులు, ఫ్యామిలీ ఆడియెన్స్‌ టికెట్ల రేట్లు తగ్గిన తర్వాత చూద్దాం అన్నట్లుగా వాయిదా వేసుకుంటున్నారట.

రంగంలోకి మేకర్స్
ఈ క్రమంలో నష్టాన్ని నివారించేందుకు మేకర్స్ రంగంలోకి దిగారు. టికెట్ రేట్లపై దృష్టి పెట్టారు. టికెట్ ధర కాస్త తగ్గించాలని డిసైడ్ అయ్యారని ఇన్​సైట్ టాక్. ఈ క్రమంలోనే పలు ప్రధాన కేంద్రాల్లో సినిమా టికెట్ రేట్లను తగ్గించారు. మరి ఈ టికెట్ల ధర తగ్గింపు కొన్ని కేంద్రాలకే పరిమితం అవుతుందా? లేక అన్ని ప్రాంతాల్లోనూ తగ్గిస్తారా? అనేది తెలియాల్సి ఉంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.