ETV Bharat / entertainment

'పుష్ప' విలన్​తో యానిమల్ బ్యూటీ - సినిమా డీటెయిల్స్​ ఇవే! - FAHADH FAASIL TRIPTII DIMRI

బాలీవుడ్‌లోకి అడుగుపెట్టనున్న ఫహాద్‌ ఫాజిల్‌ - హీరోయిన్​గా యానిమల్ బ్యూటీ త్రిప్తి దిమ్రీ - సినిమా టైటిల్ ఏంటంటే?

FAHADH FAASIL TRIPTII DIMRI
FAHADH FAASIL TRIPTII DIMRI (source Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 12, 2024, 6:29 AM IST

Fahadh Faasil Bollywood Movie : ఓ వైపు హీరోగా, మరోవైపు విలన్​గా, ఇంకోవైపు కీలకమైన పాత్రల్లో - ఇలా వైవిధ్యమైన రోల్స్​ చేస్తూ ప్రేక్షకుల్ని అలరిస్తుంటారు మలయాళ స్టార్ యాక్టర్ ఫహాద్‌ ఫాజిల్‌. ముఖ్యంగా పుష్ప సిరీస్​లో విలన్‌గా నటించి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైన ఫహాద్​, త్వరలోనే బాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నట్లు గత కొద్ది రోజులుగా వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పుడీ సినిమా గురించి మరో ఆసక్తికరమైన అప్డేట్​ బయటికొచ్చింది.

తాజాగా ఈ ప్రాజెక్టుకు 'ఇడియట్స్‌ ఆఫ్‌ ఇస్తాంబుల్‌' అనే పేరును ఖరారు చేసినట్లు తెలిసింది. ఇంతియాజ్‌ అలీ దీనిని తెరకెక్కిస్తున్నారు. సినిమాలో ఫహాద్‌ సరసన యానిమల్ బ్యూటీ త్రిప్తి దిమ్రీ కనిపించనుందని టాక్ వినిపిస్తోంది.

ఈ సినిమాను రొమాంటిక్‌ కామెడీగా తీర్చిదిద్దుతున్నట్లు తెలిసింది. చిత్రంలో ఫహాద్, త్రిప్తిల జోడీ తెరపై ఆకర్షణీయంగా కనిపిస్తుందని, త్వరలో పూర్తి వివరాల్ని వెల్లడించనున్నారని చిత్ర సన్నిహిత వర్గాలు చెప్పాయి. ఇప్పటికే ప్రీ-ప్రొడక్షన్‌ పనులు ప్రారంభించుకుందట. ఇక ఈ సినిమా చిత్రీకరణ వచ్చే ఏడాది ప్రథమార్ధంలో మొదలు కానుందని సమాచారం అందింది.

Fahadh Faasil Upcoming Movies : ఇకపోతే ప్రస్తుతం ఫహాద్‌ ఫాజిల్‌ చేతిలో ఐదు చిత్రాలు ఉన్నాయి. రీసెంట్​గా రజనీ కాంత్​ వేట్టాయన్​ చిత్రంతో ప్రేక్షకులను అలరించిన ఆయన, ఇప్పుడు ఒడుమ్ కుథిరా చాడుమ్ కుథిరా, డోంట్ ట్రబుల్​ట ట్రబుల్​, మారీసన్, కరాటే చంద్రన్, ఎమ్​ఎమ్​ఎమ్​ఎన్​ సినిమాల్లో నటిస్తున్నారు. త్వరలోనే ఇవి ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. యానిమల్ భామ త్రిప్తి దిమ్రీ విషయానికొస్తే, రీసెంట్​గా భూల్​ భులయ్య 3లో కనిపించిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం 'ధడక్ 2' చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల అయ్యే అవకాశం ఉంది.

'పుష్ప 2' : 6 రోజుల్లోనే రూ.1000 కోట్లు - ఇండియన్ సినీ హిస్టరీలో ఆల్​ టైమ్​ రికార్డ్

'అఖండ 2' రిలీజ్ డేట్ ఫిక్స్​ - బాలయ్య డైలాగ్​తో కొత్త ప్రోమో అదిరింది

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.