Pushpa 2 Allu arjun : అల్లు అర్జున్ 42వ పుట్టినరోజు సందర్భంగా ఫ్యాన్స్ బన్నీ ఇంటి దగ్గర హంగామా చేశారు. గట్టిగా అరుస్తూ చేతిలో కెమెరాలతో బన్నీకి విషెస్ చెప్పారు. బన్నీ కూడా సడెన్‌గా ఎంట్రీ ఇచ్చి తన ఇంటి బయట ఉన్న ఫెన్సింగ్ లోపల నుండి అభిమానులందరికి చేయి ఊపుతూ సంతోషంగా వారి అభిమానాన్ని స్వీకరించారు.
ఇకపోతే పుట్టినరోజు సందర్భంగా కుటుంబం సమక్షంలో కేక్ కట్ చేశారు బన్నీ. అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి కూడా తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో బన్నీతో ఉన్న ఫోటోను హ్యాపీ బర్త్డే ఏమోజీతో పాటు కేక్ ఫోటోను కూడా పోస్ట్ చేశారు. జూనియర్ ఎన్టీఆర్ కూడా తన సోషల్ మీడియాలో "పుట్టినరోజు శుభాకాంక్షలు బావ" అంటూ రాసుకొచ్చారు. మెగాస్టార్ చిరంజీవి "పుట్టినరోజు శుభాకాంక్షలు బన్నీ, నీకు ఈ సంవత్సరం అంతా బాగుండాలి" అంటూ విష్ చేశారు. ఇక నేచురల్ స్టార్ నాని పుట్టినరోజు శుభాకాంక్షలతో పాటు పుష్ప 2 టీజర్ గురించి కూడా ప్రస్తావించారు. మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ అల్లు అర్జున్ ఫైర్ బ్రాండ్ అంటూ విషెస్ తెలిపారు. వరుణ్ తేజ్ లాట్స్ ఆఫ్ లవ్ అంటూ పుష్పలో అందరికి నచ్చిన తగ్గేదేలే డైలాగ్‌ను క్యాప్షన్‌గా రాసి పోస్ట్ చేసారు. ఇంకా చాలామంది అభిమానులు కూడా తమ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా బన్నీకి విషెస్ తెలిపారు.
ఆమె కోపాన్నిఇంకా మర్చిపోలేదట - బన్నీని ఎప్పటికీ వెంటాడుతూ! - Happy Birthday Allu Arjun
అమ్మోరు గెటప్‌లో బన్నీ విశ్వరూపం - గంగమ్మ జాతరలో ఒక్కొక్కరికి పూనకాలే! - Pushpa 2 Teaser