SJ Suryah Game Changer: గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్- శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న 'గేమ్ ఛేంజర్' సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. 2024 క్రిస్మస్ సందర్భంగా ఈ మూవీ విడుదల కానుందని నిర్మాత దిల్‌రాజు ఇప్పటికే చెప్పారు. ఈ సినిమాలో సీనియర్ నటుడు యస్జే సూర్య కీలక పాత్రలో కనిపించనున్నారు. అయితే సూర్య రీసెంట్గా నాని 'సరిపోదా శనివారం' సినిమాలో ప్రతినాయకుడి పాత్రలో అదరగొట్టారు. సినిమాలో సూర్య పాత్రకు మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఆయన నటనతో ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటున్నారు. ఈ నేపథ్యంలో 'గేమ్‌ఛేంజర్'లో ఆయన పాత్ర గురించి ప్రొడ్యూసర్ దిల్‌రాజు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. సూర్య పాత్ర ఎప్పటికీ గుర్తుండిపోయేలాగా ఉంటుందని 'సరిపోదా శనివారం' సినిమా సక్సెస్‌మీట్‌లో పాల్గొన్న దిల్‌రాజు అన్నారు.
'ప్రతినాయకుడు అంటే 'ఒక్కడు'లో ప్రకాశ్‌రాజ్ పాత్ర గురించి మాట్లాడేవాళ్లం. ఇప్పుడు అద్భుతంగా క్రియేట్ చేసిన ప్రతినాయకుడి పాత్రలో సూర్య అదరగొట్టాడు. రేపు 'గేమ్ ఛేంజర్'లో మళ్లీ ఇలాగే ఉంటాడు. 'గేమ్ ఛేంజర్'లో సూర్య ప్రతినాయకుడి పాత్ర చేస్తుంటే, తెలుగులో ఫ్రెష్‌గా ఉంటాడు అనుకున్నా. కానీ, ఈ సినిమాతో ఇప్పటికే ఆయన స్థానం సంపాదించేశాడు. 'గేమ్ ఛేంజర్'లో ఆయన పాత్రకు కూడా పేపర్లు పడతాయి' అని దిల్‌రాజు అన్నారు. దీంతో చెర్రీ ఫ్యాన్స్‌లో ఒక్కసారిగా జోష్ పెరిగిపోయింది.
#Gamechanger లో #SJSurya గారికి కూడా పేపర్స్ పడతాయి. - #DilRaju pic.twitter.com/y3jHleAwVo
— Rajesh Manne (@rajeshmanne1) September 5, 2024
మరో అప్డేట్: అయితే రిలీజ్ ప్రారంభమై చాలా రోజులు అయినప్పటికీ ఒక పాట మినహా మేకర్స్ నుంచి ఎలాంటి అప్డేట్ రాలేదు. దీంతో ఫ్యాన్స్ కాస్త నిరాశకు గురవుతున్నారు. అందుకే వినాయక చవితి సందర్భంగా ఫ్యాన్స్‌కు సర్ప్రైజ్ ఇవ్వాలని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 7న సినిమా రిలీజ్ డేట్ లేదా సెకండ్ సింగింల్ అప్డెట్ ఇచ్చే ఛాన్స్ ఉంది.
ఈ సినిమాలో రామ్ చరణ్ డ్యుయెల్ రోల్లో కనిపించనున్నారని సమాచారం. ఇక చెర్రీ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అడ్వాణీ నటిస్తోంది. అంజలి, శ్రీకాంత్, సముద్రఖని, నవీన్ చంద్ర కీలక పాత్రలు పోషిస్తున్నారు. మ్యూజిక్ సంచలనం తమన్ సంగీతం అందిస్తుండగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌లో సినిమా రూపొందుతుంది.
'గేమ్ ఛేంజర్' మళ్లీ వాయిదా?- దిల్‌రాజు క్లారిటీ - Ram Charan Game Changer