Ram Charan Game Changer: గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్- శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా 'గేమ్ ఛేంజర్'. భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ చిత్రం రూపొందుతోంది. తాజాగా సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఇప్పటికే ఆలస్యం అవుతూ వస్తున్న ఈ సినిమాను 2024 క్రిస్మస్కు రిలీజ్ చేస్తామని నిర్మాత దిల్‌రాజు గతంలో చెప్పారు. అయితే మళ్లీ ఈ సినిమా విడుదల పోస్ట్‌పోన్ అయ్యిందని, 2025లో చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుందని ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో రిలీజ్ విషయంపై నిర్మాత దిల్‌రాజ్ క్లారిటీ ఇచ్చారు.
'గేమ్ ఛేంజర్ రిలీజ్ మళ్లీ వాయిదా అని వస్తున్న వార్తలు రూమర్లు. ఈ సినిమా క్రిస్మస్కే థియేటర్లలోకి వస్తుంది. మూవీ షూటింగ్ పూర్తయింది. రామ్‌చరణ్, శంకర్ ఇమేజ్‌ను ఈ సినిమా మారుస్తుంది. ఈ చిత్రం మంచి విజయం అందుకుంటుంది. పొలికల్, యాక్షన్ నేపథ్యంలో సాగే పవర్‌ఫుల్ కథాంశంతో ఇది ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. శంకర్ గతంలో ఇలాంటి సినిమాలు చాలా చేశారు. 'రోబో'తో ఆయన పంథా మార్చుకున్నారు' అని తాజాగా 'మాస్కో ఇంటర్నేషనల్ ఫిల్మ్ వీక్' ఈవెంట్లో పాల్గొన్న దిల్‌రాజు స్పష్టం చేశారు.
కాగా, స్టార్ డైరెక్టర్ శంకర్ ఈ సినిమాను పొలిటికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో హీరో రామ్‌చరణ్ పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. అయితే ఇందులో చెర్రీది డ్యుయెల్ రోల్ అని టాక్ వినిపిస్తుంది. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇక బాలీవుడ్ బ్యాటీ కియారా అడ్వాణీ ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. తెలుగు నటి అంజలీ, సీనియర్ దర్శకులు ఎస్జే సూర్య, శ్రీకాంత్, సునీల్, సముద్రఖని కీలక పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకు మ్యూజిక్ సంచలనం తమన్ సంగీతం అందిస్తున్నారు.
మరోవైపు రామ్‌చరణ్ 'ఉప్పెన' ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబు సనతో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సినిమాలో చెర్రీకి జోడీగా బాలీవుడ్ బ్యాటీ జాన్వీ కపూర్ నటిస్తున్నారు.