ETV Bharat / entertainment

'ప్రేమలు' తెలుగు వెర్షన్ రెడీ!- రిలీజ్ ఎప్పుడంటే? - ప్రేమలు సినిమా రిలీజ్

Premalu Movie Telugu Release: చిన్న సినిమాగా తెరకెక్కి భారీ విజయాన్ని అందుకుంది మలయాళ మూవీ 'ప్రేమలు'. అయితే ఈ మూవీకి వస్తున్న రెస్పాన్స్​తో మేకర్స్ తెలుగులోనూ డబ్ చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా థియేర్లలోకి రానుంది.

EPremalu Movie Telugu
Premalu Movie Telugu
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 28, 2024, 10:08 PM IST

Premalu Movie Telugu Release: మలయాళ సెన్సెషనల్ హిట్ 'ప్రేమలు' మూవీ సూపర్ హిట్​ టాక్​తో దూసుకుపోతోంది. ఫీల్ గుడ్ లవ్​ జానర్​లో తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 9న రిలీజై కేరళలో సక్సెస్​ఫుల్​గా రన్ అవుతోంది. ఫలితంగా రూ.5 కోట్ల బడ్జెట్​తో రూపొందిన ఈ సినిమా ఇప్పటివరకు రూ.50+ కోట్లు వసూల్ చేసినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే మలయాళంలో ఆడియెన్స్​కు బాగా కనెక్ట్​ అయిన 'ప్రేమలు' త్వరలోనే తెలుగు వెర్షన్​లోనూ రిలీజ్ కానుంది.

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి కుమారుడు ఎస్ ఎస్ కార్తికేయ ఈ సినిమా తెలుగు రైట్స్ దక్కించుకున్నారు. ఈ విషయాన్ని కార్తికేయ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. 'ప్రేమలు సినిమాతో తొలిసారి డిస్ట్రిబ్యూషన్​లో దిగుతున్నా. నేను మూవీ చూడగానే ఈ ఫార్ములా తెలుగులో కూడా వర్కౌట్ అవుతుందని అనుకుంటున్నా. మార్చిలో థియేటర్లలో కలుద్దాం' అని ఓ వీడియో పోస్ట్​ చేశారు. అయితే ఈ సినిమాను మార్చి 8న తెలుగులో గ్రాండ్​గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు ఇన్​సైడ్ టాక్ వినిపిస్తోంది. కానీ, ఈ తేదీపై అఫీషియల్ అనౌన్స్​మెంట్ రావాల్సి ఉంది.

ఒకవేళ మార్చి 8వ తేదీ కన్ఫార్మ్​ అయితే ప్రేమలుకు బాక్సాఫీస్ వద్ద పోటీ ఉంటుంది. టాలీవుడ్ స్టార్ హీరో గోపీచంద్ 'భీమా', యంగ్ హీరో విశ్వక్​సేన్ 'గామి' అదే రోజు రిలీజ్ కానున్నాయి. అయితే 'భీమా' 'గామి', 'ప్రేమలు' మూడు సినిమాలు డిఫరెంట్​ జానర్​లో తెరకెక్కినందున ఎవరికీ వారే దీమాగా ఉన్నారు.

Premalu Movie Cast: ఇక ప్రేమలు విషయానికొస్తే, దర్శకుడు గిరీశ్ ఏడీ ఈ సినిమా తెరకెక్కించారు. మలయాళ మూవీయే అయినప్పటికీ సినిమా బ్యాక్​ డ్రాప్​ మొత్తం హైదరాబాద్‌లోనే ఉంది. ఈ చిత్రంలో మమితా, నస్లేన్, మీనాక్షి రవీంద్రన్, అల్తాఫ్ సలీమ్, అఖిల భార్గవన్ కీలక పాత్రల్లో నటించారు. భావన స్టూడియోస్ బ్యానర్​పై మలయాళ హీరో ఫహాద్ ఫాజిల్ ఈ సినిమాను నిర్మించారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

OTT : రూ.3 కోట్ల బడ్జెట్​తో​ రూ.50కోట్లకు పైగా వసూళ్లు - ప్రేక్షకుల మదిని దోచిన చిత్రాలివే!

రూ.4 కోట్ల బడ్జెట్​ - 'పుష్ప' విలన్​ కొత్త సినిమాకు అదిరిపోయే కలెక్షన్స్​!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.