ETV Bharat / entertainment

ఆ విషయంలో రాజమౌళి అంటే కోపం : ప్రశాంత్‌ వర్మ - రాజమౌళిపై ప్రశాంత్ వర్మ

Prasanth Varma Rajamouli : 'హనుమాన్‌'తో భారీ విజయాన్ని అందుకున్న దర్శకుడు ప్రశాంత్‌ వర్మ దర్శకధీరుడు రాజమౌళిపై కామెంట్స్​ చేశారు. జక్కన్న అంటే తనకు కోపం వచ్చిందని అన్నారు. ఆ వివరాలు.

ఆ విషయంలో రాజమౌళి అంటే కోపం : ప్రశాంత్‌ వర్మ

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 28, 2024, 3:07 PM IST

Prasanth Varma Rajamouli : 'హనుమాన్'​​ చిత్రంతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు దర్శకుడు ప్రశాంత్‌ వర్మ. ఈ చిత్రంతో పాన్ ఇండియా సక్సెస్​ అందుకున్న ఆయన ప్రస్తుతం విజయోత్సాహంతో వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఇందులో భాగంగా దర్శకధీరుడు రాజమౌళిపై తనకున్న అభిప్రాయాన్ని తెలిపారు.

ఆయన అంటే తనకెంతో ఇష్టమని ప్రశాంత్‌ వర్మ అన్నారు. రాజమౌళి టీమ్‌లోకి ప్రవేశించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసినట్లు గుర్తు చేసుకున్నారు. "ఆయన మేకింగ్‌ స్టైల్‌ అంటే నాకెంతో ఇష్టం. ఆయన వద్ద అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేయాన్ని ఎన్నోసార్లు ట్రై చేశాను. ఇంజినీరింగ్​ చదువుతున్న రోజుల్లోనే అవకాశాల కోసం మెయిల్స్‌ పంపించాను. నా అభ్యర్థనను సున్నితంగా తిరస్కరించారు. తమ టీమ్​లో ఖాళీ లేదని చెప్పారు. హార్డ్‌వర్క్‌, టాలెంట్‌ ఉన్నా నన్నెందుకు తీసుకోవడం లేదనే కారణంతో ఆయనపై కోపం కూడా వచ్చింది. అదే సమయంలో ఏకలవ్యుడు గుర్తుకువచ్చారు. జక్కన్న సినిమాలు, మేకింగ్‌ వీడియోలు చూసి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను" అని ప్రశాంత్ వర్మ పేర్కొన్నారు.

"పెద్ద హీరోలతో పని చేయడానికి నేను వ్యతిరేకం కాదు. కానీ వాళ్లతో సినిమా చేయడం అంటే ఎక్కువ సమయం పట్టొచ్చు. వాళ్ల కోసం ఎదురుచూసి నా టైమ్​ వృథా చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ తర్వాత డెడ్‌లైన్‌ పెట్టుకుని వర్క్ చేస్తున్నాను. ఒకవేళ టామ్‌ క్రూజ్ వచ్చినా కూడా నా వద్ద ఉన్న వాళ్లతోనే సినిమా చేస్తాను" అని ప్రశాంత్‌ వర్మ చెప్పుకొచ్చారు.

ఇకపోతే ఈ హనుమాన్ సినిమా బడ్జెట్​ రూ.30కోట్ల లోపే అని అంటున్నారు. ఈ చిత్రం విడుదలైన పది రోజుల్లోనే వరల్డ్​ వైడ్​గా దాదాపు రూ.200 కోట్లు(Hanuman Movie Collections) కలెక్ట్ చేసినట్లు సినీ విశ్లేషకుల అంచనా వేస్తున్నారు.

Hanuman Movie Cast : హనుమాన్లో చిత్రంలో తేజ సజ్జా- అమృత అయ్యార్ హీరోహీరోయిన్లుగా నటించారు. స్టైలిష్​ విలన్​గా వినయ్​ రాయ్, వరలక్ష్మి శరత్ కుమార్, గెటప్ శ్రీను, సముద్రఖని, వెన్నెల కిషోర్, సత్య వంటి తదితురులు ఇతర కీలక పాత్రల్లో నటించారు. ప్రైమ్​షో ఎంటర్​టైన్​మెంట్ బ్యానర్​పై నిరంజన్ రెడ్డి ఈ సినిమాను నిర్మించారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

PVCUలో రవితేజతో సినిమా ప్లాన్- హనుమాన్ డైరెక్టర్ క్రేజీ అప్డేట్

'ఆదిపురుష్‌'లో ఆ సీన్స్‌ అస్సలు నచ్చలేదు : ప్రశాంత్‌ వర్మ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.