ETV Bharat / entertainment

'కల్కి' సూపర్ హిట్​ - మరి నెక్స్ట్​ ఏంటి డార్లింగ్​? - Prabhas Ucpoming Movies - PRABHAS UCPOMING MOVIES

Prabhas Upcoming Movies : 'కల్కి' హిట్​ టాక్​తో ప్రపంచమంతా హోరెత్తుతున్న వేళ ప్రభాస్ అభిమానులు ఆయన అప్​కమింగ్ మూవీస్​ గురించి డిస్కషన్​ మొదలెట్టారు. మరీ ఆయన 'కల్కి' తర్వాత ఏయే సినిమాలకు సైన్ చేశారంటే?

PRABHAS UCPOMING MOVIES
PRABHAS (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jun 27, 2024, 8:38 PM IST

Prabhas Upcoming Movies : టాలీవుడ్​లోని మోస్ట్ వెర్సటైల్ యాక్టర్స్​లో ప్రభాస్ ఒకరు. జయాపజయాలతో సంబంధం లేకుండా ఈ స్టార్ హీరో తన యాక్టింగ్​తో అభిమానులను ఆకట్టుకుంటూనే ఉన్నారు. ఇటీవలే వచ్చిన 'సలార్​'తో సూపర్ సక్సెస్​ అందుకున్న ఈ స్టార్ హీరో ఇప్పుడు 'కల్కి2898 AD ' సినిమాతో మాసివ్ సక్సెస్ అందుకున్నారు. 'కల్కి'లో రెబల్ స్టార్ యాక్టింగ్​కు నార్త్​లోనూ మంచి క్రేజ్ ఏర్పడింది. అక్కడి వాళ్లు కూడా ప్రభాస్ కోసం సినిమా చూసేందుకు మరింత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.

ఇక 'కల్కి' తర్వాత ప్రభాస్‌ నుంచి వచ్చే తర్వాతి సినిమా ఏంటా అంటూ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఆయన 'కల్కి'తో పాటు 'సలార్ 2', 'రాజాసాబ్​', 'స్పిరిట్​', 'కన్నప్ప' మూవీస్​కు సైన్ చేసిన సంగతి తెలిసిందే. ప్రభాస్​ కూడా ఈ సినిమాల షూటింగుల్లో యాక్టివ్​గానే పాల్గొంటున్నారు. 'కల్కి' చిత్రీకరణ సమయంలోనే అప్పుడప్పుడు ఈ రెండు సెట్స్​లోనూ సందడి చేసేవారు.

'సలార్‌ : శౌర్యంగ పర్వం' రీసెంట్​గానే మొదలైంది. పార్ట్​ 1 సక్సెస్​తో జోష్​లో ఉన్న ప్రశాంత్​ నీల్ ఈ రెండో పార్ట్​ను మొదటి దానికంటే ఎక్కువ ఎలివేషన్స్‌, యాక్షన్‌ సీన్స్‌తో తీర్చిదిద్దనున్నట్లు సమాచారం. అంతే కాకుండా ఖాన్సారాను ఇంకాస్త విస్తృతంగా చూపించాలనుకుంటున్నారట. అందుకే ఈ సినిమా చిత్రీకరణ మరింత ఆలస్యం కానుంది.

ఇది కాకుండా సందీప్‌ వంగా డైరెక్షన్​లో తెరకెక్కుతున్న 'స్పిరిట్‌'పై రెబల్ అభిమానులు భారీగానే ఆశలు పెట్టుకున్నారు. ఇందులో ప్రభాస్ ఓ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్​గా కనిపిస్తారన్న విషయం వల్ల ఈ చిత్రం మరింత క్రేజ్ సంపాదించుకుంది. అయితే ఇది ఇంకా పట్టాలెక్కలేదు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న డైరెక్టర్ త్వరలోనే పూర్తి స్క్రిప్ట్‌ను లాక్‌ చేయనున్నట్లు సమాచారం. దీంతో ఈ మూవీ షూటింగ్​ కూడా మరింత ఆలస్యమయ్యేలా ఉంది. అయితే ఈ ఏడాది చివరి నాటికి మూవీ సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉంది.

దీంతో ప్రభాస్​ను ఇక ఈ ఏడాది మరోసారి సిల్వర్​ స్క్రీన్​పై చూడాలంటే అది 'రాజా సాబ్‌' వల్లనే సాధ్యమవుతుంది. ఇప్పటికే ఈ మూవీ కీలక షెడ్యూల్స్‌ను పూర్తి చేసుకుంది. ప్రభాస్‌ ఇంకాస్త సమయాన్ని కేటాయిస్తే, మిగిలిన షూటింగ్​ కూడా త్వరలోనే పూర్తి కానున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ సినిమా కూడా ఈ ఏడాదిలోనే విడుదలయ్యే ఛాన్స్​లు ఉన్నాయి. . ఈలోపల 'కన్నప్ప'లో కేమియో రోల్​లో ఆయన కనిపించనున్నారు.

ఇవి కాకుండా 'సీతారామం' ఫేమ్​ హను రాఘవపూడి డైరెక్షన్​లో ఓ పీరియడ్‌ యాక్షన్‌ డ్రామాలో ప్రభాస్​ నటించనున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్​ గురించి ఇప్పటివరకు ఎటువంటి టాక్ రాలేదు.

'కల్కి' కోసం పెద్దమ్మ రివ్యూ - ప్రసాద్స్​ వద్ద అకీరా సందడి - Kalki 2898 AD

'క‌ల్కి 2898 AD' రెండో భాగం టైటిల్ ఇదేనా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.