ETV Bharat / entertainment

షూటింగ్​లకు ప్రభాస్​ బ్రేక్​ - సమంతను ఫాలో అవుతున్నారా? - prabhas health

Prabhas take Break : ప్రభాస్ షూటింగ్​లకు బ్రేక్ ఇవ్వనున్నట్లు తెలిసింది. దీంతో నెటిజన్లు ప్రభాస్ సమంతను ఫాలో అవుతున్నారా అంటూ కామెంట్లు చేస్తున్నారు.

షూటింగ్​లకు ప్రభాస్​ బ్రేక్​ - సమంతను ఫాలో అవుతున్నారా?

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 31, 2024, 1:38 PM IST

Updated : Jan 31, 2024, 2:15 PM IST

Prabhas take Break : వరుస ఫ్లాప్స్​లో ఉన్న రెబల్ స్టార్ ప్రభాస్ రీసెంట్​గా భారీ యాక్షన్​ ఎంటర్​టైనర్​ 'సలార్​'తో సూపర్​ హిట్​ కొట్టి మళ్లీ ట్రాక్​లోకి వచ్చిన సంగతి తెలిసిందే. కేజీయఫ్​ ఫేమ్​ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఓటీటీలో కూడా మంచి రెస్పాన్స్​ను అందుకుంటోంది. ఇకపోతే ప్రభాస్ చేతిలో మరో నాలుగు సినిమాల వరకు ఉన్నాయి. అయితే ప్రభాస్ ఇప్పుడు షూటింగ్​లకు కాస్త బ్రేక్ ఇవ్వనున్నట్లు ప్రచారం తెరపైకి వచ్చింది. ప్రస్తుతం ఈ విషయమే సోషల్​ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. కాస్త రెస్ట్​ తీసుకొని హెల్త్​పై దృష్టి సారించేందుకు డార్లింగ్​ ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు కథనాలు వస్తున్నాయి. ఇక ఈ విషయం తెలుసుకుంటున్న నెటిజన్లు ప్రభాస్ హీరోయిన్​ సమంతను ఫాలో అవుతున్నారని సరదాగా కామెంట్లు చేస్తున్నారు. సమంత కూడా ఈ మధ్య సినిమాల షూటింగ్​లకు కాస్త బ్రేక్​ ఇచ్చి ఆరోగ్యంపై పూర్తి శ్రద్ధ పెట్టిన సంగతి తెలిసిందే. తాజాగా మళ్లీ 'సిటాడెల్'​ డబ్బింగ్​ వర్క్​తో మళ్లీ ప్రొఫెషనల్​ లైఫ్​లోకి అడుగుపెట్టింది.

Prabhas Upcoming Movies : ఇకపోతే ప్రభాస్​ త్వరలోనే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో నటించిన సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్​ 'కల్కి'తో(Prabhas Kalki Movie) ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ మూవీ షూటింగ్​ను రీసెంట్​గా పూర్తి చేశారు ప్రభాస్. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇందులో బాలీవుడ్ బిగ్​ బీ అమితాబ్​, దిశా పటానీ, దీపికా పదుకొణె, కమల్ హాసన్ వంటి భారీ తారాగాణం నటించారు. దీని తర్వాత ప్రభాస్​ మారుతి డైరెక్షన్​లో రాజాసాబ్​గా(Prabhas Rajasaab) రాబోతున్నారు. ఇది హారర్​ కామెడీగా రాబోతుంది. ఇందులో ముగ్గురు కథనాయికలు నటిస్తున్నారు. అనంతరం అర్జున్ రెడ్డి, యానిమల్​ ఫేమ్​ సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్​లో స్పిరిట్ చిత్రంలో నటించనున్నారు డార్లింగ్​. ఇది సెట్స్​పైకి వెళ్లడానికి చాలా సమయం పడుతుంది. వీటితో పాటే భారీ హైప్ నెలకొన్న 'సలార్ 2' కూడా పట్టాలెక్కించాల్సి ఉంది. ఈ లైనప్​ మొత్తం పూర్తయ్యేసరికి మరో రెండు మూడేళ్లు కచ్చితంగా పడుతుంది.

ఫిబ్రవరి బాక్సాఫీస్​ - 4 వారాలు 14 సినిమాలు

సంక్రాంతి సినిమాల OTT డేట్స్​ - ఏ సినిమా ఎప్పుడంటే?

Last Updated : Jan 31, 2024, 2:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.