Prabhas Suriya Cameo Roles in Bollywood : ప్రస్తుతం బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ మార్కెట్ ఊపందుకున్న సంగతి తెలిసిందే. వరుసగా సినిమాలు రిలీజ్ అవుతూ మంచి వసూళ్లను అందుకుంటున్నాయి. అలానే రాబోయే రోజుల్లో మరిన్ని భారీ సినిమాలు థియేటర్లలో ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతున్నాయి.
అందులో మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ 'సింగం అగైన్'(Singham Again Movie) కూడా ఒకటి. రోహిత్ శెట్టి దర్శకత్వంలో అజయ్ దేవగణ్ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రమిది. ప్రస్తుతం ఈ సింగం అగైన్ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. భారీ యాక్షన్ డ్రామాగా రూపొందుతోంది. అయితే తాజాగా ఈ సినిమా విషయంలో ఓ క్రేజీ రూమర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ సినిమాలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, తమిళ సింగం సూర్య సాలిడ్ కేమియో రోల్స్‌లో కనిపించనున్నారని ప్రచారం సాగుతోంది. ఒకవేళ ఇదే కనుక నిజం అయితే బాలీవుడ్ బాక్సాఫీస్ షేక్ అవుతుందనే చెప్పాలి! కాగా, గతంలో ప్రభాస్ 'యాక్షన్ జాక్సన్' అనే హిందీ చిత్రంలో గెస్ట్ రోల్లో మెరిసిన సంగతి తెలిసిందే. ఇక సూర్య రీసెంట్గా 'సర్ఫిరా' చిత్రంలో కేమియో రోల్ చేశారు. చూడాలి మరి ఈ ఇద్దరు కలిసి మరి సింగం అగైన్‌లో కనిపిస్తారో లేదో.
Prabhas Upcoming Movies : ప్రస్తుతం సలార్, కల్కి 2898 ఏడీ చిత్రాలతో వరుస భారీ బ్లాక్ బస్టర్లను అందుకున్న ప్రభాస్ రాజా సాబ్ చిత్రంతో బిజీగా ఉన్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఇది రిలీజ్ కానుంది. దీంతో పాటు స్పిరిట్, ఫౌజీ, సలార్ సీక్వెల్, కల్కి 2898 ఏడీ సీక్వెల్స్‌ను చేయనున్నారు ప్రభాస్. త్వరలోనే ఇవి షూటింగ్‌ను ప్రారంభించుకోనున్నాయి.
Suriya Kanguva Movie : ఇకపోతే సూర్య త్వరలోనే భారీ పీరియాడికల్ యాక్షన్ డ్రామా మూవీ 'కంగువా'తో ఆడియెన్స్‌ను పలకరించనున్నారు. సినిమాలో సూర్య మూడు భిన్నమైన లుక్స్‌లో కనిపించనున్నారని అంటున్నారు. దిశా పటానీ హీరోయిన్గా నటించింది. బాబీ దేవోల్ కీలకపాత్ర పోషించారు. పది భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. పలు అంతర్జాతీయ భాషల్లోనూ ఇది రిలీజ్ కానుంది.
బాలయ్య - బోయపాటి 'బీబీ 4'లో విలన్‌గా టాలీవుడ్ హీరో! - ఎవరంటే? - Balakrishna Boyapati BB4 Movie