Prabhas Salaar Ranbir Animal Movie Top Trending : ప్రస్తుతం ఓటీటీలో రెండు సూపర్ హిట్ చిత్రాలు స్ట్రీమింగ్ అవుతూ రికార్డ్ వ్యూస్‌తో దూసుకెళ్తున్నాయి. కోట్ల కొద్ది వ్యూస్‌ను దక్కించుకుంటూ ఓటీటీ ప్రియులను మరింత అట్రాక్ట్ చేస్తున్నాయి. అవే భారీ యాక్షన్ డ్రాప్ 'సలార్', 'యానిమల్'. ఇప్పటికే థియేటర్లలో చూసిన వారు కూడా మరోసారి చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. స్క్రీన్స్‌లో మిస్ అయిన వారు కూడా చూసేందుకు రెడీ అయిపోతున్నారు. ఎలాగో వీకెండ్ వచ్చేసింది కాబట్టి మీరు కూడా ఈ చిత్రాలను చూసి ఎంచక్కా ఆస్వాదించండి..
వరల్డ్ వైడ్‌గా టాప్ ట్రెండింగ్ : ఖాన్సార్ సామ్రాజ్యం బ్యాక్‌డ్రాప్‌లో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రూపొందించిన చిత్రమిది. 700 కోట్లకు పైగా కలెక్షన్స్‌ను అందుకున్న ఈ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం ఇప్పుడు ఓటీటీలోనూ అదే రేంజ్లో రెస్పాన్స్‌ను అందుకుంటోంది. ఇటీవలే నెట్‌ఫ్లిక్స్ వేదికగా విడుదలైన ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా అత్యధిక వీక్షణలతో టాప్ ట్రెండింగ్‌లో దూసుకువెళ్తోంది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో అందుబాటులో ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా చూసిన వారంతా ప్రశాంత్ నీల్ డైరెక్షన్, ప్రభాస్ యాక్షన్, కటౌట్ పై ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు. ఫారిన్ ఆడియెన్స్ ఫిదా అయిపోతున్నారు. సోషల్ మీడియాలో సలార్ హ్యాష్ ట్యాగ్‌ను విపరీతంగా ట్రెండ్ చేస్తున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
OTTలో 'సలార్' క్రేజ్ పీక్స్- ఫారినర్స్ రెస్పాన్స్ అదుర్స్
సలార్‌తో పాటుగా : యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌తో ఫాదర్ అండ్ సన్ ఎమోషనల్ డ్రామాగా రిలీజై బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న చిత్రం యానిమల్. జనవరి 26న అర్ధరాత్రి నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో అందుబాటులో ఉంది. ఈ చిత్రం కూడా వచ్చీ రాగానే సలార్‌తో పాటుగా ఓటీటీని షేక్ చేయడం మొదలుపెట్టేసింది. ఊహించని రేంజ్లో బ్లాక్ బస్టర్ రేంజ్ రెస్పాన్స్ అందుకుంటూ టాప్ ట్రెండింగ్‌లో దూసుకెళ్తోంది. కాగా, ఈ చిత్రంలో హీరో రణబీర్ కపూర్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నాతో పాటు అనిల్ కపూర్, బాబీ దేఓల్ కీలక పాత్రల్లో నటించారు. సందీప్ రెడ్డి వంగా చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఇండియా బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.700కోట్లకు పైగా సంచలన వసూళ్లను అందుకుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
నాన్న, నాన్న - 'యానిమల్'లో ఈ పదం ఎన్ని వందల సార్లు వాడారో తెలుసా?