ETV Bharat / entertainment

ఒకేసారి రెండు కొత్త సినిమాలు సెట్స్​పైకి - Prabhas LineUp Movies - PRABHAS LINEUP MOVIES

Prabhas Upcoming Movies : ప్రభాస్ నటించనున్న రెండు కొత్త సినిమాలు ఏకకాలంలో సెట్స్​పైకి వెళ్లనున్నాయి. వాటి గురించి పూర్తి వివరాలు స్టోరీలో.

Source ANI
Source ANI (Source ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : May 6, 2024, 7:04 AM IST

Prabhas Upcoming Movies : ఒకేసారి ఏకకాలంలో రెండు మూడు సినిమాలతో కలిసి జర్నీ చేయడంలో పాన్ ఇండియా స్టార్​ ప్రభాస్‌ మరింత రాటుదేలిన సంగతి తెలిసిందే. కొన్నేళ్లుగా ఇలానే కొనసాగిస్తున్నారు. ఒక సినిమా పూర్తి కాకుండానే మరో చిత్రాన్ని సెట్స్​పైకి తీసుకెళ్లడం చేస్తున్నారు. ప్రస్తుతం రాజాసాబ్‌ మువీలో నటిస్తున్న ఆయన మరో రెండు కొత్త చిత్రాలని ఏకకాలంలో సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారని తెలిసింది.

హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్సాల్సిన పీరియాడిక్‌ లవ్​ డ్రామాను జులైలో ప్రారంభించనున్నారని తెలిసింది. అలాగే దీంతోపాటు, సలార్‌ 2 షూటింగ్​ను స్టార్ట్ చేయనున్నారని సమాచారం అందింది. వచ్చే నెల నుంచే ప్రభాస్‌ లేకుండానే సలార్‌ 2 షూటింగ్ మొదలు కానుందట. అయితే ప్రభాస్​ జులై నుంచి ఈ మూవీ షూటింగ్​లో పాల్గొనున్నట్టు తెలిసింది. అంటే ఒకే నెలలో రెండు సినిమాల చిత్రీకరణలో ఆయన పాల్గొనున్నారనమాట. అలానే మరోవైపు రాజాసాబ్‌ షూటింగ్​ను పూర్తి చేయనున్నారు. ఇంకా ఈ సంవత్సరంలోనే సందీప్‌ రెడ్డి వంగా చిత్రాన్ని కూడా మొదలు పెడతారట. ఈ లైనప్​ చూస్తుంటే ఫ్యాన్స్​కు ఇక పండగే అని తెలుస్తోంది. వారు ఏళ్ల తరబడి ఎదురుచూసే ఛాన్స్​ లేకుండా వెంట వెంటనే ప్రభాస్ తన సినిమాలతో అలరించనున్నారని అర్థమవుతోంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

జపాన్‌లో సలార్​ : జపాన్​లో టాలీవుడ్ సినిమాలకు ఆదరణ పెరిగిన సంగతి తెలిసిందే. మొదట సూపర్ స్టార్​ రజనీ కాంత్‌ చిత్రాలతో ప్రారంభమైన ఈ ఆదరణ ఆ తర్వాత క్రమంగా ఇతర చిత్రాలకూ దక్కడం మొదలైంది. బహుబలి, ఆర్​ఆర్​ఆర్​ ఇప్పటికే అక్కడ మంచి వసూళ్లను సాధించాయి. ఇప్పుడు ఆ జాబితాలోకి సలార్‌ చేరనుంది. ప్రభాస్‌ హీరోగా పృథ్వీరాజ్‌ సుకుమారన్‌, శ్రుతిహాసన్‌ కీలక పాత్రలో కీలక పాత్రల్లో ప్రశాంత్‌ నీల్‌ డైరెక్ట్ చేసిన చిత్రమిది. ఇప్పటికే ప్రపంచ వాప్తంగా పలు దేశాల్లో విడుదలై రూ.700 కోట్ల వరకు వసూలు చేసిన ఈ చిత్రం ఇప్పుడు జులై 5న జపాన్‌లో రిలీజ్ కానుంది. చూడాలి మరి ఈ చిత్రం ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో.

'ఆ సినిమా అస్సలు రజనీ స్టైల్​ కాదు - డైరెక్టర్​ స్టోరీని అందుకే అలా రాశారు' - Rajinikanth Vettaiyan Movie

'పుష్ప' సాంగ్ జోరు ఆగేదేలే- 3రోజుల్లోనే 50మిలియన్లు, లక్ష ఇన్​స్టా రీల్స్! - Pushpa 2 Records

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.