Kalki 2898 AD Audio Rights : పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ - మహానటి ఫేమ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబోలో తెరకెక్కుతున్న భారీ మైథాలజీ సైన్స్ ఫిక్షన్ మూవీ కల్కి2898 ఏ.డి. బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్, యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్, బోల్డ్ బ్యూటీస్ దీపికా పదుకొణె, దిశా పటానీ వంటి భారీ తారాగణం ఈ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. జూన్ 27న వరల్డ్ వైడ్‌గా థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కానుందీ సినిమా. కానీ ఈ మూవీటీమ్ ఇంతవరకు ప్రమోషన్స్‌ను స్టార్ట్ చేయలేదు. దీంతో అందరూ ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Kalki 2898 AD First Single : అయితే తాజాగా ఓ అప్డేట్ను అనౌన్స్ చేసింది ఫిల్మ్ యూనిట్. సినిమా మ్యూజికల్ రైట్స్‌ను ప్రముఖ మ్యూజిక్ లెబెల్ కంపెనీ సరిగమ సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు మేకర్స్. త్వరలోనే ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ కూడా విడుదల చేయనున్నట్లు తెలిసింది. ఈ నెలాఖరులో రిలీజ్ చేసేలా మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు.
Kalki AD Movie Story : కాగా, ఈ చిత్రంలో ప్రభాస్ భైరవ అనే పాత్రలో నటిస్తున్నారు. మహాభారతంతో మొదలై క్రీస్తుశకం 2898లో పూర్తయ్యే కథ ఇది అని ఆ మధ్య నాగ్ అశ్విన్ చెప్పారు. మొత్తం 6 వేల ఏళ్ల వ్యవధిలో సాగే కథ ఇది అని మూవీటీమ్ చెబుతోంది. గతం, భవిష్యత్తుతో ముడిపడిన కథ కాబట్టి అందుకు తగ్గట్టుగా ప్రపంచాల్ని సృష్టించి రూపొందిస్తున్నారట. ఆ ప్రపంచాలు కూడా భారతీయతని ప్రతిబింబించేలా ఉంటాయని అంటున్నారు. ఇప్పటికే విడుదలై ప్రచార చిత్రాలు కూడా ఫ్యాన్స్‌ను బానే ఆకట్టుకున్నాయి. చూడాలి మరి భారీ అంచనాలను పెంచిన ఈ మైథాలజీ సైన్స్ ఫిక్షన్ సినిమా ఎలాంటి అద్భుతాలను సృష్టిస్తుందో.
రామ్‌చరణ్ హీరోయిన్ను పట్టేసిన రాకింగ్ స్టార్ యశ్! - Toxic Movie Heroine