Prabhas Kalki Who is Ashwathama : లవ్ స్టోరీలు, ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ కథలు కన్నా రామాయణం, మహాభారతం లాంటి ఇతిహాసాలను సినిమా కథలుగా మార్చి తెరకెక్కించడమే ఇప్పుడు నయా ట్రెండ్. ఆ మధ్య ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన "హను-మాన్", ప్రభాస్ హీరోగా ఓంరౌత్ డెరెక్షన్లో వచ్చిన "ఆదిపురుష్" వంటి సినిమాలే ఇందుకు ఉదాహరణ. ఇక మహాభారతం టచ్‌తోనే మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ కూడా "కల్కి 2898AD"ని తెరక్కెక్కిస్తున్నారు. ఇందులో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తుండటం వల్ల సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.
ఈ సినిమాలో బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కూడా అశ్వత్థామ అనే కీలక పాత్ర పోషిస్తున్నారు. తాజాగా ఆయన పాత్రను పరిచయం చేస్తూ ఓ గ్లింప్స్ కూడా రిలీజ్ చేసింది. ఇందులో ఆయన చిరిగిన బట్టలు ధరించి, ఒంటిపై గాయాలతో, నుదుటిపై మణితో కనిపించారు. తాను గురు ద్రోణాచార్య కొడుకుని అశ్వత్థామను అంటూ చెప్పి వెళ్లిపోతారు. దీంతో ఈ గ్లింప్స్ చూసిన సినీ ప్రియులు అసలు అశ్వత్థామ అంటే ఎవరు, ఆయన కథేంటి? సినిమాలో ప్రభాస్ పాత్రకు ఆయనకు సంబంధం ఏమిటి? అని తెగ వెతికేస్తున్నారు.
అశ్వథామ ఎవరంటే? - మహాభారతంలోని అత్యంత కీలక పాత్రల్లో ఒకటే ఈ అశ్వత్థామ. ఈయన గురు ద్రోణాచార్యుడి ఏకైక కుమారుడు. కృష్ణుడి యుక్తితో కౌరవుల తరపు యుద్ధం చేస్తున్న ద్రోణాచార్యుడికి అబద్ధం చెప్పి మరణించేలా చేస్తారు పాండవులు. ఆ విషయం తెలుసుకుని కోపోద్రిక్తుడైన అశ్వత్థామ, తన స్నేహితుడైన దుర్యోధనుడికి పాండవులను నాశనం చేస్తానని మాటిస్తాడు. చెప్పినట్లుగానే పాండవుల పిల్లలందరినీ నిద్రలో ఉండగానే హతమారుస్తాడు. ఆ విషయం తెలిసి అశ్వత్థామను తుద ముట్టించాలని పాండవులు తరలివస్తారు. అయితే అదే సమయంలో అశ్వత్థామ వారిని చంపేందుకు కుట్ర పన్నుతాడు. దీంతో కృష్ణుడు అశ్వత్థామను "మరణమనేది లేకుండా ఆకలి దప్పులతో ఒంటినిండా గాయాలతో జీవనం సాగించు. రక్తం, చీము కారుతున్న నిన్ను చూసి ఏ ఒక్కరూ కూడా దగ్గరకు రానివ్వరు" అని శపిస్తాడు. అలా శాపానికి గురైన అశ్వత్థామ పాత్రనే ఇప్పుడు "కల్కి 2898AD"లో బిగ్ బీ పోషిస్తున్నారు. మరి కల్కికి, అశ్వత్థామకు అసలు సంబంధమేంటి? కలియుగంలో కల్కితో యుద్ధం చేయడం కోసమే ఎదురుచూస్తూ ఉన్నాడా? లేదా కల్కికి సాయం చేయాలని వేచి చూస్తున్నాడా? అనేది సినిమా విడుదల తర్వాతే తెలుసుకోవాలి.
కల్కి పురాణం ప్రకారం - మహాభారతం ప్రకారం ఈ భూమిపై ఉన్న ఏడుగురు చిరంజీవుల్లో అశ్వత్థామ ఒకరు. అందులో పరశురాముడు, కృపాచార్యుడు, వ్యాస, అశ్వత్థామలు కలిసి కల్కిని చూసేందుకు హిమాలయాల్లోని సంభల అనే ప్రాంతానికి చేరుకుంటారని కల్కి పురాణంలో ఉంది. పరశురాముడు స్వయంగా కల్కికి అన్ని విద్యలు నేర్పి గురువుగా వ్యవహరిస్తాడట. వీరంతా కలిసి కల్కి ధర్మ సంస్థాపనలో సహాయం చేస్తారని అందులో పేర్కొన్నారు. ధర్మం అదుపు తప్పినప్పుడో, కలియుగం చివరిలోనో కల్కి వస్తాడని ఆ శాస్త్రం చెబుతుంది. మరి కల్కి వచ్చే సమయం ఆసన్నమైందని అమితాబ్ బయలుదేరాడా లేదా మరేదైనా సంకేతం ఉందా? నాగ్ అశ్విన్ ఏం చూపించాలనుకుంటున్నారు అనేది సినిమా రిలీజ్ అయితే కానీ తెలియదు మరి.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ప్రభాస్ లేటెస్ట్ లుక్ - లాంగ్ హెయిర్, గడ్డంతో కటౌట్ అదిరింది బాస్! - Kalki 2898 AD
ప్రశాంత్ వర్మ సూపర్ అప్డేట్ - డ్రాగన్‌తో జై హనుమాన్ పోరాటం! - Prasanth Varma Jai hanuman