kalki 2898 AD Bookings : 'కల్కి' 2898 ఏడీ చిత్రం బుకింగ్స్‌లో అదరగొడుతోంది. సాధారణంగానే ప్రభాస్ సినిమా అంటే భారీ స్థాయిలో ఓపెనింగ్స్ ఉంటాయి. కానీ ఇప్పుడు అంతకుమించి అనేలా ఎపిక్ సైన్స్ ఫిక్షన్ కల్కి బుకింగ్స్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో కనిపించే పోస్ట్‌ల ప్రకారం ఒక్క గంటలోనే 60 వేల టికెట్లు బుక్ అయినట్లుగా ఫ్యాన్స్ చెబుతున్నారు. ఓ పోస్ట్ ప్రకారం - హైదరాబాద్‌లో టాప్ 5 అడ్వాన్స్ డే1 గ్రాస్‌లో కల్కి టాప్‌లో నిలిచింది. ఇప్పటివరకూ కేవలం బుకింగ్స్‌లోనే హైదరాబాద్‌లో కల్కి రూ.14.5 కోట్లు వసూలు చేసిందట. అది కూడా ఇంకా రిలీజ్‌కు రెండు రోజుల సమయం ఉండగానే. తర్వాతి స్థానంలో రూ.12.5 కోట్లతో సలార్ ఉంది. ఆ తర్వాత రూ.10.5 కోట్లతో ఆర్ఆర్ఆర్, రూ.9.5కోట్లతో ఆదిపురుష్ ఉంది. దీంతో రిలీజ్‌కు ముందు కల్కి రికార్డులు క్రియేట్ చేయడం పక్కా అని ప్రభాస్ ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు.
ఇక Sacnilk డేటా ప్రకారం - ఇప్పటివరకు అడ్వాన్స్ బుకింగ్స్‌లో మొత్తంగా దాదాపు 5 లక్షలకు పైగా టికెట్లు అమ్మడుపోయాయని తెలిసింది. 15.92 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసిందట. తెలుగు వెర్షన్‌కు 4.5 లక్షలు టికెట్లు(రూ.14.46 కోట్లు), తమిళ వెర్షన్‌కు 8, 934 టికెట్లు(రూ.14.75 లక్షలు), హిందీ వెర్షన్‌కు 37,952 టికెట్లు(రూ.1.15 కోట్లు), మలయాళ వెర్షన్‌కు 1,126 టికెట్లు (రూ.1.9 లక్షలు), కన్నడ వెర్షన్‌కు 182 టికెట్లు(రూ.42,300) అమ్ముడుపోయాయట.
Hyderabad Top5 Advance Day1 Gross:
— 𝐒𝐔𝐌𝐀𝐍𝐓𝐇 𝐕𝐀𝐑𝐌𝐀 (@__SUMANTHVARMA) June 24, 2024
1.#Kalki28989AD -14.5Cr [3 days more]
2.#Salaar- 12.5 Crs
3.#RRR - 10.5 Cr
4.#Adipurush- 9.5 Cr
Rebel star is in his own league 👑
Ika nundi Nizam nawab tag pakkana Non-Prabhas vesukuni
Salaam kotti Pondi 🧎#Prabhas
pic.twitter.com/kZN1D7cHWx
ఓవర్సీస్లో ప్రభాస్ క్రేజ్ - అంతర్జాతీయ స్థాయిలోనూ ప్రభాస్‌కు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. దీంతో అక్కడ కూడా కల్కి బుకింగ్స్ భారీగానే జరుగుతున్నాయి. నార్త్ అమెరికాలో ఇప్పటికే లక్ష 25 వేల టికెట్లు అమ్ముడుపోయినట్లు తెలిసింది.
కాగా, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న సైన్స్ ఫిక్షన్ స్టోరీనే కల్కి. దీపిక పదుకొణె, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటానీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్ర మొదటి భాగం జూన్ 27న రిలీజ్ కానుంది. దీని కోసం అభిమానులు, సినీ ప్రియులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
Star Star Rebel Star 🔥🔥#Kalki2898AD isn’t just the release of a movie. It’s havoc. It’s madness. The world is under its mania 🙇♂️🙇♂️
— Prathyangira Cinemas (@PrathyangiraUS) June 24, 2024
YET ANOTHER ROCK SOLID - 125K tickets sold in North America now 💥💥#Prabhas @VyjayanthiFilms @Kalki2898AD pic.twitter.com/zlfNJww9CV
ప్రభాస్ కాలికి గాయం ఇంకా తగ్గలేదా? - వీడియో వైరల్! - Prabhas Kalki 2898 AD
'కల్కి' టికెట్ రేట్లు పెంపునకు AP ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ - ఎంత పెరిగాయంటే?