Prabhas Kalki 2898 AD Movie Review : 600 కోట్ల బడ్జెట్ - అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ లాంటి బలమైన క్యాస్టింగ్ - తొలి రోజే రూ.100 కోట్లతో బాక్సాఫీస్‌ను కొల్లగొట్టే సత్తా ఉన్న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ - అత్యున్నత సాంకేతికత, కళ్లు చెదిరే వీఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ - ఇదీ అంతర్జాతీయ ప్రమాణాలతో తెరకెక్కిన 'కల్కి 2898 ఏడీ' స్టామినా. సైన్స్ ఫిక్షన్‌కు మైథాలజీతో ముడిపెడుతూ ప్రేక్షుకలకు సరికొత్త అనుభూతిని పంచేందుకు డైరెక్టర్ నాగ్ అశ్విన్ చేసిన అతి పెద్ద భారీ ప్రయత్నం. దీంతో ఏ సినిమాకు లేనంత హైప్, బజ్ కల్కి చుట్టూనే చేరింది. అదే విధంగా ఊహించని రేంజ్లో కల్కి టికెట్ బుకింగ్స్(Kalki 2898 AD Bookings) రికార్డులు సృష్టించాయి. తాజాగా ఈ సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఇంతకీ ఈ మూవీ ఎలా ఉందో తెలుసుకుందాం.
మహాభారతంలోని కొన్ని ముఖ్య ఘట్టాలను ఆధారంగా చేసుకుని కల్కి 2898 ఏడీ సినిమాను రూపొందించారు. సినిమాలో అశ్వత్థామగా అమితాబ్ బచ్చన్, యాస్కిన్‌గా కమల్ హాసన్, భైరవగా ప్రభాస్, సుమతిగా దీపిక పదుకొణె, రోక్సీగా దిశా పటానీ నటించారు. ఇక భైరవ దోస్త్‌గా బుజ్జి అనే స్పెషల్ రొబోటిక్ కారును రూ.7 కోట్ల ఖర్చుతో ప్రత్యేకంగా డిజైన్ చేయించి మరీ వినియోగించారు.
ప్రభాస్ సినిమా కావడంతో ఓవర్సీస్ సహా దేశంలోని అన్ని థియేటర్లలోనూ ప్రేక్షకులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ప్రీమియర్స్ మొదటి షో చూసిన ప్రభాస్ ఫ్యాన్స్ ఆడియెన్స్ సోషల్ మీడియా వేదికగా తమ రివ్యూలను పోస్ట్ చేస్తున్నారు.
ఓవర్సీస్ ప్రీమియర్స్ భారీ బ్లాక్ బస్టర్ - యూఎస్ఏ ప్రీమియర్స్ నుంచి వచ్చిన సమాచారం ప్రకారం "కల్కి యూనానిమస్ ఎపిక్ బ్లాక్ బస్టర్. అద్భుతమైన విజువల్ వండర్ మాస్టర్‌పీస్. ఇండియన్ సినిమాలో ఎప్పుడు చూడనటువంటి చిత్రమిది. కళ్లు చెెదిరే విజువల్ స్టోరీ టెల్లింగ్‌తో ప్రతి ఒక్కరు స్టన్ అవ్వడమే. ఇక మాటల్లేవ్ అంతే." అని చెబుతున్నారు.
ఇక మొత్తంగా ఓవర్సీస్ ప్రీమియర్స్ నుంచి భారీ బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వినిపిస్తోంది. ఓపెనింగ్స్ డే అడ్వాన్స్ సేల్స్ రూ.100 కోట్లు దాటేశాయని అంటున్నారు.
Almost 30mins of Mahabharatam sequence, each & every frame will be divine & Magical 🔥✨🕉️#Kalki2898AD #Prabhas pic.twitter.com/rs3mA2FqnS
— Siva Harsha (@SivaHarsha_23) June 26, 2024
Kalki 2898 AD Movie Twitter Review మహాభారతం ఎపిసోడ్ 30 నిమిషాలు కేక! - "మొదటి 30 నిమిషాలు మహాభారతం ఎపిసోడ్ కేక. ప్రతి ఫ్రేమ్, ప్రతి షాట్ అద్భుతంగా ఉంది. ఒక డివైన్ ఫీలింగ్ వచ్చింది." అని రాసుకొచ్చాడు ఓ నెటిజన్.
"కల్కి సినిమా క్లైమాక్స్ చూస్తే షేక్ అయిపోతున్నాను. సీట్లో కూర్చోని వణికి పోయాను. ఏడుస్తూ ఉండిపోయాను. నా గొంతు పూడ్చుకుపోయింది. సినిమా అంటే ఇది. ప్రభాస్ అంటే ఏమిటో చూపించిన సినిమా ఇది. ఇండియా దద్దరిల్లిపోయే హిట్ ఇది." అని మరో నెటిజన్ కామెంట్ పెట్టాడు.
"కల్కి 2898 ఏడీ నిజంగా థియేట్రికల్ ఎక్స్‌పీరియెన్స్. నాగ్ అశ్విన్ సన్నివేశాలను సృజనాత్మకంగా మలిచిన తీరు అద్బుతం. కొన్ని సన్నివేశాలు చూడటానికి కళ్లు కూడా సరిపోవు. అమితాబ్ బచ్చన్ పాత్ర అద్బుతం. ప్రభాస్ అద్భుతంగా ఉన్నాడు. డైలాగ్స్ మాత్రం కాస్త నిరాశపరిచాయి." అని ఇంకొక నెటిజన్ కామెంట్ చేశాడు.
Not in Regular elevated movie more interesting and engaging but not elevating @dulQuer small role in flashback🔥🔥
— Beyond The Reel (@btrsir) June 26, 2024
More guest apperances and prabhas dance nd comedy suprise element🔥🔥#prabhas #Kalki #kalki2898ad #Kalki2898ADonJune27 #kalki2898adreview #DeepikaPadukone
"ఫస్టాఫ్ వరల్డ్ క్లాస్. హాలీవుడ్ లెవల్‌లో ఉంది. థియేటర్స్‌లో తప్పక చూడాలి. కథ కాస్త సాగదీతగా ఉంది. ఇంటర్వెల్ సీన్ సూపర్. ప్రతి 10 నిమిషాలకు ఒక కొత్త క్యారెక్టర్‌తో సర్ప్రైజ్. సెకండాఫ్‌లో కథ పుంజుకుంది. నాన్ కల్కి రికార్డ్స్ పక్కా. నార్త్ ఆడియెన్స్‌కు ఫస్టాఫ్ చాలు. సెకండాఫ్ బోనస్." అని మరొకరు రాసుకొచ్చారు.
Movie going into phase larger than life characters and arrival of kalki makes bigger impact nd interesting lhase🔥🔥🙏🙏
— Beyond The Reel (@btrsir) June 26, 2024
Nag executes elevations to emotions well to kalki arrival🔥🔥#prabhas #Kalki2898AD #kalki2898adreview #Kalki2898ADbooking
#Kalki2898AD UK premiers :
— Saideep Yandamuri (@saideep_satya77) June 26, 2024
Done with first Half …..Taking ayte world class ….Hollywood level Stuff and one
Must experience it in theatres ….Story chala lag undhi …interval 🔥
Every 10 minutes ki oka character surprise untadhi 😉
if 2nd half can pull the story , Non kalki… pic.twitter.com/Tco1LXjQnd
ఆ ఈశ్వరుడే ఈ భైరవుడు! ఇంతటి సక్సెస్ ప్రభాస్‌కి మాత్రమే సాధ్యం! - Kalki 2898 AD
'కల్కి' మూవీకి వెళ్తున్నారా? ఈ 14 విషయాలు తెలిస్తే సినిమా చూడటం వెరీ ఈజీ! - Kalki 2898 AD