Kalki 2898 AD Movie : కల్కి 2898 AD నుంచి తాజాగా వచ్చిన అప్డేట్తో బుజ్జి ఎవరనే ఉత్కంఠకు తెరపడింది. నిన్న(మే 17) ప్రభాస్ చెప్పిన ఆ ప్రత్యేక వ్యక్తి ఎవరో కాదు ఈ సినిమా కోసం ప్రత్యేకంగా రూపొందిన కారు అనేలా తెలుపుతూ ఓ వీడియోను మేకర్స్ విడుదల చేశారు.
పూర్తి వివరాల్లోకి వెళితే - పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ - దర్శకుడు నాగ్ అశ్విన్ కాంబోలో తెరకెక్కుతున్న భారీ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీ 'కల్కి 2898 ఏడీ'. పాన్ వరల్డ్ స్థాయిలో ఊహకు మించిన అంచనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే మే 17న ప్రభాస్ చేసిన ఓ పోస్ట్‌తో కల్కి సినిమా విపరీతంగా ట్రెండ్ అయింది. 'ఎట్టకేలకు మన జీవితంలోకి ఓ ప్రత్యేక వ్యక్తి రాబోతున్నారు. వెయిట్ చేయండి' అంటూ ఆయన షేర్ చేసిన పోస్ట్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. కొన్ని గంటలు ఆగి 'నా బుజ్జిని మీకు పరిచయం చేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను' అంటూ మరో పోస్ట్‌తో మరింత ఆసక్తిని పెంచారు. దీంతో అసలు బుజ్జి ఎవరు? ఎలా ఉంటుంది? అని ఫ్యాన్స్‌లో ఆసక్తి బోలేడైంది.
ఈ క్రమంలోనే తాజాగా బుజ్జికి సంబంధించిన ఒక సూపర్ గ్లింప్స్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఆద్యంతం ఆసక్తిగా సాగిన ఈ విడియోలో ఒక చిన్న రోబోను చూపించారు. బుజ్జి పేరుతో అందరూ దాన్ని పిలుస్తున్నారు. ఎవరా బుజ్జి అంటూ అంటూ వచ్చిన ఈ చిట్టి రోబోకు హీరోయిన్ కీర్తి సురేశ్ వాయిస్ ఓవర్ ఇచ్చింది. 'నా లైఫ్ ఎంటి? బాడీ లేకుండా బతికేయాల్సిందేనా' అంటూ బుజ్జి సరదా సరదా కబుర్లు చెబుతూనే బాధపడుతుండగా ఇంతలో ప్రభాస్ ఎంట్రీ ఇచ్చి 'నీ టైమ్ మొదలైంది బుజ్జి' అంటూ ఒక స్పెషల్ డిజైన్ కారును రివీల్ చేయబోయారు. అంతలో ట్విస్ట్ ఇస్తూ బుజ్జి గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే మే 22 వరకు వేచి ఉండాల్సిందేనని తెలిపారు. కాగా, ఈ చిత్రం జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
పవన్ విషయంలో అతడిపై రేణూ దేశాయ్ ఫుల్ ఫైర్! - Renu Desai Pawankalyan