Prabhas Kalki 2898 AD Bujji Car Features : కటౌట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డ్యూడ్ అనే డైలాగ్‌కు ఫర్ఫెక్ట్గా సరిపోతారు హీరో ప్రభాస్. హిట్, ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా వరుస పాన్ ఇండియా సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్నారు. గతేడాది సలార్‌తో ఊచకోత కోసిన ఈ కాటేరమ్మ కొడుకు ఇప్పుడు కల్కి అవతారంలో రాబోతున్నారు. నాగ్ అశ్విన్ దర్శకుడిగా వైజయంతీ మూవీస్ రూపొందిస్తోంది.
తాజాగా ఈ సినిమాలోని బుజ్జి అనే రోబోటిక్ ఎలక్ట్రిక్ కారును గ్రాండ్ ఈవెంట్ నిర్వహించి మరీ మేకర్స్ రిలీజ్ చేశారు. హాలీవుడ్ రేంజ్లో డిఫరెంట్‌గా ఉన్న ఈ భారీ సైజ్ కారు ప్రభాస్ అభిమానుల్ని విపరీతంగా ఆకట్టుకుంది. అయితే ఇప్పుడీ కార్ ప్రత్యేకతల వివరాలు తెలిశాయి.
మహీంద్రా అండ్ జాయెమ్ ఆటోమోటివ్ కంపెనీలు సంయుక్తంగా కలిసి దీన్ని తయారు చేశాయి. ఈ కారు కోసమే రూ. 7 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిసింది. ఇంకా ఈ కారు టైర్ చూస్తే ఓ సగటు మనిషిని మించిపోయేలా డిజైన్ చేశారు. ఈ టైర్ పొడవు - 6075 మిమీ, వెడల్పు - 3380మిమీ, ఎత్తు - 2186మిమీ. రిమ్ సైజ్-34.5 ఇంచెస్. ఈ కారు టైర్లను ప్రముఖ టైర్ల కంపెనీ సీయెట్ (CEAT) ప్రత్యేకంగా తయారు చేసిందట. ఈ కారు వెయిట్ 6 టన్నులని తెలిసింది. పవర్ 94 Kw, బ్యాటరీ 47 KWH, టార్క్ 9800NM అంట. మొత్తంగా ఈ స్పెషల్ కారు కోసం ఇంజనీర్లు బాగా కష్టపడ్డారని తెలుస్తోంది.
నిర్మాత అశ్వనీ దత్ భారీ బడ్జెట్‌తో దీన్ని నిర్మిస్తున్నారు. జూన్ 27న వరల్డ్ వైడ్‌గా థియేటర్లలో రాబోతుంది. ఇంకా ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ , లోకనాయకుడు కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటాని కీలక పాత్రలో నటిస్తున్నారు. ప్రభాస్ భైరవ అనే పాత్రలో కనిపించనున్నారు. మహాభారతంతో మొదలై క్రీస్తుశకం 2898లో పూర్తయ్యే కథ ఇది.
బుజ్జి కోసం 'కల్కి' మేకర్స్ స్పెషల్ ఈవెంట్ - ఎక్కడ జరగనుందంటే? - Kalki 2898 AD Movie