ETV Bharat / entertainment

పాపం పూజా హెగ్డే - ఎట్టకేలకు స్టార్ కిడ్ సినిమాలో హీరోయిన్​గా ఛాన్స్​! - Pooja Hegde New Movie Sanki

Pooja Hegde New Movie : పొడుగు కాళ్ల సుందరి పూజా హెగ్డే ఎట్టకేలకు ఒక సినిమా ఛాన్స్​ను అందుకుంది. ఓ స్టార్ కిడ్ సినిమాలో హీరోయిన్​గా నటించేందుకు రెడీ అయింది. ఆ వివరాలు.

పాపం పూజా హెగ్డే -  ఎట్టకేలకు స్టార్ కిడ్ సినిమాలో హీరోయిన్​గా ఛాన్స్​!

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 9, 2024, 6:03 PM IST

Updated : Mar 9, 2024, 6:15 PM IST

Pooja Hegde New Movie : పూజా హెగ్డే ఒకప్పుడు పొడుగు కాళ్ల సుందరిగా మస్త్ క్రేజ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ పేరు ఇప్పుడు ఇండస్ట్రీలో అంతగా వినపడట్లేదు. చాలా కాలం నుంచి ఈ ముద్దుగుమ్మ ఏ చిత్రంలోనూ నటించలేదు. అయితే ఇప్పుడీ ముద్దుగుమ్మకు ఓ స్టార్ కిడ్ సినిమాలో హీరోయిన్​గా నటించే అవకాశం వచ్చింది.

వివరాల్లోకి వెళితే కెరీర్ మొదట్లో పూజా హెగ్డే పేరు బాగా వినిపించేది. అన్నీ సినిమాల్లోనూ తనే హీరోయిన్​గా కనిపించేది. ముకుందతో మొదలైన ఈ ముద్దుగుమ్మ ప్రయాణం ఆ తర్వాత ఒక లైలా కోసం, మహర్షి, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, రంగ స్థలం అంటూ చాలా చిత్రాల్లోనే సందడి చేసింది. ఆ తర్వాత హిందీలోనూ వరుస అవకాశాలను అందుకుని కెరీర్​లో ముందుకెళ్లింది.

కానీ తెలుగులో అలా వైకుంఠపూరములో తర్వాత పూజా హెగ్డేకు గడ్డు కాలం మొదలైంది. రాధేశ్యామ్ సినిమా చేయగా అది దెబ్బకొట్టింది. దీని తర్వాత కోలీవుడ్ లో బీస్ట్​ చేస్తే అది కూడా చేదు ఫలితాన్ని ఇచ్చింది. మళ్లీ ఆచార్య చేయగా బెడిసికొట్టింది. హిందీలో సర్కస్, కిసీ కి భాయ్ కిసీ కా జాన్ కూడా డిజాస్టర్​గా నిలిచాయి. అలా అప్పటి వరకు టాప్ హీరోయిన్​గా చెలామని అయిన ఈ భామ అదృష్టం ఐరెన్ లెగ్​గా మారిపోయింది. ఈమె సక్సెస్ రుచి చూసి మొత్తంగా మూడు సంవత్సరాలకుపైగా అయిపోయింది.

అయితే ప్రస్తుతం పూజా హెగ్డే ఓ ఛాన్స్​ను అందుకుంది. అది ఓ స్టార్ కిడ్​ నటిస్తున్న హిందీ చిత్రంలో. అతడే సునీల్ శెట్టి వారసుడు అహన్ శెట్టి. ఇతడు బాలీవుడ్​కు తడప్ చిత్రంతో అడుగు పెట్టాడు. ఈ చిత్రం తెలుగులో సూపర్ హిట్ అయిన కార్తికేయ ఆర్‌ఎక్స్ 100 చిత్రానికి రీమేక్. కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు. అయితే మరి ఇప్పుడు తన కొత్త చిత్రంలో ఐరెన్ లెగ్ ట్యాగ్​తో ఉన్న పూజా హెగ్డేతో నటించనున్నాడు. మరి ఈ మూవీ ఎలాంటి రిజల్ట్​ను ఇస్తుందో. కాగా, ఈ చిత్రానికి సంకీ అనే టైటిల్​ను ఖరారు చేశారు. ఈ చిత్రం 2025 వాలెంటైన్స్​ డే సందర్భంగా థియేటర్లలో రానున్నట్లు మూవీటీమ్ అఫీషియల్​గా ప్రకటించింది.

ఈ వారం టాప్ 10 సిరీస్​ ఇవే - వేరే లెవెల్ థ్రిల్ పక్కా​!

ఉత్కంఠగా సలార్ విలన్​ కొత్త మూవీ ట్రైలర్ - ఇది పక్కా మరో మాస్టర్ పీస్​!

Last Updated : Mar 9, 2024, 6:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.