ETV Bharat / entertainment

పవన్​ 'ఉస్తాద్ భగత్ సింగ్' నుంచి ఊహించని సర్​ప్రైజ్​

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 16, 2024, 1:12 PM IST

Updated : Mar 16, 2024, 2:36 PM IST

Pawankalyan Ustaad Bhagat Singh : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్​ నుంచి అదిరిపోయే సర్​ప్రైజ్​ ఇచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేశారు. దానికి సంబంధించిన అప్డేట్​ను సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. ఆ వివరాలు.

పవన్​ 'ఉస్తాద్ భగత్ సింగ్' నుంచి ఊహించని సర్​ప్రైజ్​
పవన్​ 'ఉస్తాద్ భగత్ సింగ్' నుంచి ఊహించని సర్​ప్రైజ్​

Pawankalyan Ustaad Bhagat Singh : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలను లైన్​లో పెట్టిన సంగతి తెలిసిందే. కానీ ప్రస్తుతం ఏపీలో ఎలక్షన్స్ దగ్గర పడుతున్న నేపథ్యంలో షూటింగ్​లకు కాస్త బ్రేక్ ఇచ్చారు. ప్రచార సభల్లో బిజీ బిజీగా గడుపుతున్నారు. అయితే రీఎంట్రీలో వకీల్ సాబ్​, భీమ్లానాయక్, బ్రో చిత్రాలతో ప్రేక్షకుల్ని అలరించారు.

ప్రస్తుతం ఆయన చేతిలో ఉన్న చిత్రాల్లో ఉస్తాద్ భగత్ సింగ్ కూడా ఒకటి. 'గబ్బర్ సింగ్' వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత పవన్ కల్యాణ్ - హరీష్ శంకర్ కాంబోలో వస్తుండటం వల్ల దీనిపై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఫుల్ లెంగ్త్ మాస్ ఎంటర్‌టైనర్‌గా రాబోతుందీ చిత్రం. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్‌ను గత ఏడాదిలోనే మొదలు పెట్టారు మేకర్స్​. మొదటి షెడ్యూల్‌ను కూడా జరిపారు. కానీ ఎలక్షన్స్​ దగ్గర పడుతున్న నేపథ్యంలో పవన్ కల్యాణ్ డేట్స్ అడ్జస్ట్ కాక షూటింగ్ తాత్కాలికంగా నిలిచిపోయింది.

కానీ ఈ చిత్రం మొత్తానికే ఆగిపోయిందన్న వార్తలు జోరుగా ప్రచారం సాగాయి. ఇలాంటి రూమర్స్ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి అదిరిపోయే ట్రీట్‌ను ఇచ్చేందుకు రెడీ అయ్యారు మేకర్స్. ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ నుంచి ఊహించనిది రాబోతుంది అంటూ ఓ పోస్ట్ పెట్టారు. అలాగే, రెండు ఎమోజీలను కూడా జత చేశారు. దీంతో ఈ మూవీ నుంచి గ్లింప్స్ రాబోతుందని అంతా ఆశిస్తున్నారు. పవన్ పొలిటికల్ డైలాగ్‌తో కూడిన ఓ స్పెషల్ వీడియోను త్వరలోనే రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.

ఈ 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాలో యంగ్ సెన్సేషనల్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, రవిశంకర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. సూపర్ హిట్ 'తేరీ' చిత్రానికి రీమేక్‌గా ఇది రూపొందుతోందని సమాచారం. ఇంకా చిత్రంలో అశుతోష్ రాణా, గౌతమి, నర్రా శ్రీను, చమ్మక్ చంద్ర తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

రష్మికను అలా పిలిచిన ఆనంద్ దేవరకొండ - హ్యాపీగా ఫీలవుతున్న ఫ్యాన్స్​!

దీపికా పదుకొణె - 'కల్కి' కన్నా ముందే నటించిన తొలి తెలుగు సినిమా ఏంటో తెలుసా?

Last Updated : Mar 16, 2024, 2:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.