Pawankalyan TheyCallHim OG : టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఓజీ(ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్). సాహో ఫేమ్ సుజీత్ దీనిని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ 27న గ్రాండ్‌గా థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది. గ్యాంగ్‌స్టర్ బ్యాక్‌డ్రాప్‌తో రానున్న ఈ సినిమా షూటింగ్ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో తాత్కాలికంగా కొన్ని రోజులు వాయిదా పడింది. తాజాగా ఈ సినిమా నుంచి మరో సూపర్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.
అదేంటంటే ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ యాక్టర్ ఇమ్రాన్ హష్మీ విలన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే నేడు ఇమ్రాన్ హష్మీ బర్త్ డే. ఈ సందర్భంగా ఓజీ టీమ్ ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఇమ్రాన్ పోస్టర్‌ను విడుదల చేసింది. ఆయన ఈ సినిమాలో ఇమ్రాన్ ఒమీ భావు అనే గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనిపించనున్నట్లు తెలిపింది. అయితే ఇదే పోస్టర్‌ను ఇమ్రాన్ కూడా తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. "గంభీర నువ్వు తిరిగి బొంబాయి తిరిగి వస్తున్నావని విన్నా. మాటిస్తున్నా. ఇద్దరిలో ఒక తలకాయే మిగులుతుంది" అంటూ రాసుకొచ్చారు. అంటే ఆయన గంభీర అనే పాత్రకు సవాల్ విసురుతున్నారని అర్థమవుతోంది. మరి పవనే ఆ గంభీర పాత్ర చేసేది అనేది క్లారిటీ లేదు. కాగా, ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్‌తో పాటు గ్లింప్స్ కూడా ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. ఇందులో పవన్ లుక్, స్టైల్, గ్యాంగస్టర్ యాక్టింగ్, బ్యాక్‌గ్రౌండ్ మ్యాజిక్ ఫ్యాన్స్‌లో పూనకాలు తెప్పించాయి.
OG Movie Cast And Crew : ఓజీ సినిమా విషయానికొస్తే జపాన్-ముంబయి నేపథ్యంలో ఈ కథ సాగనుంది. పవన్ కల్యాణ్ సరసన ప్రియాంకా మోహన్ హీరోయిన్గా నటిస్తోంది. ఇమ్రాన్ హష్మీ, అర్జున్ దాస్, శ్రియా రెడ్డి, ప్రకాశ్ రాజ్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై దానయ్య భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ స్వరాలు అందిస్తున్నారు.
నేను సింగిల్‌గా ఉండిపోవడానికి కారణం అతనే - అసలు విషయాన్ని చెప్పిన హైపర్ ఆది! - Hyper aadi Marriage