Pawankalyan Hari Hara Veeramallu Release Date : పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు ఈ ఏడాది ఎన్నికల పండగతో పాటు మరో రెండు పండగలు కూడా ఉన్నాయి. ఇప్పటికే ఓజీ ఈ ఏడాది సెప్టెంబర్‌లో విడుదల కానుందని సమాచారం. తాజాగా టీజర్ విడుదలైన హరి హర వీరమల్లు మూవీ కూడా ఈ ఏడాది రిలీజ్ అవుతుందని అంటున్నారు. అయితే రెండు చిత్రాల విడుదల తేదీపై ఇంకా క్లారిటీ లేదు.
వీరమల్లు విషయానికి వస్తే ఇప్పటివరకు క్రిష్ ఆ మూవీ దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నారు. ఇకపై దర్శకత్వ బాధ్యతలు కొత్త దర్శకుడు జ్యోతి కృష్ణ తీసుకుంటారు. ఇప్పటికే విడుదలైన టీజర్, పోస్టర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం ఈ ఏడాది డిసెంబర్ 20 లేదా ఆపైన క్రిస్టమస్‌కు విడుదల కావొచ్చనే వార్తలు జోరుగా ప్రచారం అవుతున్నాయి. ఎన్నికల సందడి ముగిసిన తర్వాత మిగిలిన షూటింగ్ ప్రారంభంకానుంది. ఈ మూవీకి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇందులో పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్, జాక్వలైన్ ఫెర్నాండెజ్ నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ఒక కీలక పాత్రలో కనిపించనున్నాడు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
వరలక్ష్మీ శరత్‌కుమార్ థ్రిల్లర్ మూవీ ఎలా ఉందంటే? - Sabari Movie review
అమ్మాయి హత్య కేసులో ఇరుక్కున్న సుహాస్ బయటపడ్డాడా? - Prasanna vadhanam Review