ETV Bharat / entertainment

గేమ్ ఛేంజర్, ఓజీ : బాబాయ్​ - అబ్బాయ్​ బాక్సాఫీస్ క్లాష్! - ఓజీ రిలీజ్ డేట్ సెప్టెంబర్ 27

Pawan kalyan OG vs Game Changer : పవన్ కల్యాణ్ ఓజీ, రామ్​చరణ్ గేమ్​ ఛేంజర్ సినిమా రిలీజ్ డేట్స్​లు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఆ వివరాలు.

గేమ్ ఛేంజర్, ఓజీ : బాబాయ్​ - అబ్బాయ్​ బాక్సాఫీస్ క్లాష్!

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 30, 2024, 9:16 PM IST

Pawan kalyan OG Release Date : ఓ సినిమా అదిరే రేంజ్​లో ఘన విజయాన్ని సొంతం చేసుకుంటే దాని విడుదల తేదీ ఫిల్మ్​ ఇండస్ట్రీలో ఎంతో స్పెషల్​గా నిలుస్తుంది. అలాంటి తేదీల్లో సెప్టెంబరు 27 కూడా ఒకటి. 2013లో అదే రోజున 'అత్తారింటికి దారేది' విడుదలై బ్లాక్ బాస్టర్ హిట్ అందుకుంది. ఇప్పుడదే డేట్‌కు 'ఓజీ'ని తీసుకురానున్నట్లు తెలుస్తోంది. సోషల్‌ మీడియాలో ఇప్పుడిదే టాపిక్‌ ఫుల్​ ట్రెండింగ్‌లో ఉంది. అయితే మూవీ టీమ్​ నుంచి ఎటువంటి అఫీషియల్ అనౌన్స్​మెంట్ రాలేదు. అయితే ఇదే డేట్​కు మెగా పవర్ స్టార్ రామ్​చరణ్​ నటిస్తున్న 'గేమ్​ ఛేంజర్' వస్తుందని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు బాబాయ్​ పవన్ కల్యామ్​ వస్తుండడంతో ఇది జరిగే అవకాశం లేదు.

Game Changer Release Date : మరో విషయమేమింటే గేమ్​ ఛేంజర్​ కోసం నిర్మాత దిల్​ మరో డేట్​ను కూడా పరిశీలిస్తున్నారట. అదే అక్టోబర్ 11. కాబట్టి బాబాయ్ – అబ్బాయ్​ మధ్య పోటీ ఉండకపోవచ్చు. ఇంకో రకంగా చూస్తే 'ఓజీ' నైజాం హక్కులను దిల్ రాజే సొంతం చేసుకున్నారు. సో దిల్​రాజు తన సినిమాతో తానే క్లాష్​కు వచ్చే అవకాశాలు ఉండవు అనే చెప్పాలి. చూడాలి మరి ఈ చిత్రాల రిలీజ్​ డేట్స్​పై అఫీషియల్​ అనౌన్స్​మెంట్స్​ ఎలా ఉంటాయో.

కాగా, 'ఆర్ఆర్ఆర్' తర్వాత చరణ్ నటిస్తున్న సినిమా కావడం, పైగా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించడం,దిల్ రాజు నిర్మించడంతో గేమ్​ ఛేంజర్​పై భారీ అంచన్నాలు ఉన్నాయి. కాకపోతే ఈ సినిమా నుంచి అప్డేట్స్ రాకపోవడంతో ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారు. సినిమాలో అంజలి, కియారా అద్వాణీ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇకపోతే పవన్‌ కల్యాణ్‌ ఓజీని 'సాహో' ఫేమ్‌ సుజీత్‌ తెరకెక్కిస్తున్నారు. గ్యాంగ్‌స్టర్‌ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో ప్రియా అరుళ్‌ మోహన్‌ హీరోయిన్. బాలీవుడ్‌ నటుడు ఇమ్రాన్‌ హష్మి ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. అర్జున్‌ దాస్‌, వెంకట్‌, శ్రియా రెడ్డి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

రాజమౌళి - మహేశ్ సినిమాలో నాగార్జున?

ఆసక్తిగా 'భామా కలాపం 2' టీజర్‌ - OTTలోకి మోస్ట్ డేంజరస్ హౌస్ వైఫ్ రాక అప్పుడే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.