ETV Bharat / entertainment

'OG' వెయిటింగ్ లిస్ట్​లో అకీరా- నాన్నను అలా చూడాలని ఉందట! - Pawan Kalyan OG - PAWAN KALYAN OG

Akira Nandan OG Movie: పవన్ కల్యాన్ ఓజీ సినిమా కోసం ఆయన కుమారుడు అకీరా కూడా ఆత్రుతగా ఎదురుచూస్తున్నాడట. ఈ సినిమాలో గ్యాంగ్​స్టర్ రోల్‌లో కనిపించబోయే తండ్రిని ఎప్పుడెప్పుడు తెరపై చూద్దామా అని అకీరా వెయిట్ చేస్తున్నాడట.

PAWAN KALYAN OG
PAWAN KALYAN OG (Source: ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jul 1, 2024, 9:48 AM IST

Akira Nandan OG Movie: టాలీవుడ్ అప్‌కమింగ్ సినిమాల్లో ఒకటైన 'ఓజీ (OG)'పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. పవర్​స్టార్ పవన్ కల్యాణ్ లీడ్ రోల్‌లో- సుజీత్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతుంది. పవన్ చాలా గ్యాప్ తర్వాత స్ట్రైట్‌గా సినిమా చేస్తుండటం వల్ల ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా? అని ఫ్యాన్స్​, ప్రేక్షకుల్లో ఉత్కంఠ పెరిగిపోతుంది. ఇందులో పవన్ కొడుకు అకీరా నందన్ కూడా ఉన్నాడట.

యంగ్ హీరో అడివి శేష్ రీసెంట్​గా ఓ సందర్భంలో OG సినిమా గురించి మాట్లాడారు. స్వయంగా ఆయనే ఈ విషయాన్ని బయటపెట్టారు. 'సిల్వర్ స్క్రీన్‌పై ఈ సూపర్ ఎగ్జైటెడ్ సినిమాను చూసేందుకు పడి చచ్చిపోతున్నాడు అకీరా. వాళ్ల నాన్నను గ్యాంగ్‌స్టర్‌గా చూడటానికి చాలా ఎగ్జైట్ అవుతున్నాడు' అంటూ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అడివి శేష్‌- అకీరాకు మధ్య చాలా క్లోజ్ బాండింగ్ ఉంటుంది. వారిద్దరూ ఈ విషయాన్ని పలు ఇంటర్వ్యూల్లో షేర్ చేసుకున్నారు కూడా. పవన్ కల్యాణ్ కెరీర్ లోనే భారీ బడ్జెట్​ సినిమాగా ఇది తెరకెక్కుతుంది. ఇక త్వరలోనే సినిమా షూటింగ్​లో హీరో పవన్ పాల్గొననున్నారట.

'సాహో' సినిమా తర్వాత మూడేళ్ల గ్యాప్ తీసుకుని ఈ ప్రాజెక్టును మొదలుపెట్టిన సుజీత్‌కు ఈ గ్యాప్‌లో బాలీవుడ్ ఆఫర్స్ కూడా వచ్చాయట. ఏ హీరోతో చేయనని కేవలం పవన్‌తోనే చేయాలని ఫిక్స్ అయ్యారట. ఒక అభిమానిగా పవన్‌ను మిగతా అభిమానులు ఎలా చూడాలనుకుంటున్నారో సుజిత్‌కు తెలుసు. 'సినిమాలో ఎలాంటి ఎలిమెంట్స్ ఉండాలో తెలుసు. కాబట్టి సూపర్ గా ఉండబోతుంది' అని చెప్పడం వల్ల సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగిపోయాయి. డి.వి.వి దానయ్య నిర్మాణ బాధ్యతలు వహిస్తుండగా, ఎస్ఎస్ తమన్ సంగీతం సమకూరుస్తున్నారు.

అకీరా విషయానికొస్తే, ఇటీవల రిలీజైన ప్రభాస్ 'కల్కి 2898 AD' సినిమా చూసేందుకు థియేటర్​కు వచ్చి సందడి చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. గతంలో తండ్రిలానే మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియో ఒకటి బయటికొచ్చింది. చూడబోతే అకీరా సినిమా ఎంట్రీ కూడా త్వరలో ఉండనున్నట్లు కనిపిస్తుంది.

'కల్కి' కోసం పెద్దమ్మ రివ్యూ - ప్రసాద్స్​ వద్ద అకీరా సందడి - Kalki 2898 AD

మోదీతో అకీరా - ఆ అనుభూతి మాటల్లో వర్ణించలేనంటూ రేణు దేశాయ్ పోస్ట్ - RENU DESAI POST ON AKIRA MEETING MODI

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.