ETV Bharat / entertainment

పవన్ చేసిన కామెంట్స్​ 'పుష్ప 2' గురించేనా? - క్లారిటీ ఇచ్చిన నిర్మాత - Pawan kalyan on Pushpa 2 - PAWAN KALYAN ON PUSHPA 2

Pawan kalyan on Pushpa 2 : చెట్ల నరికివేత, స్మగ్లింగ్​ గురించి రీసెంట్​గా పవన్‌ కల్యాణ్ చేసిన కామెంట్స్ పుష్ప 2 గురించేనని అంతటా ప్రచారం సాగింది. అయితే తాజాగా దీనిపై మైత్రీ మూవీ మేకర్స్​ నిర్మాత రవి శంకర్‌ స్పందించారు. ఏం అన్నారంటే?

source ETV Bharat
pushpa 2 pawankalyan (source ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 30, 2024, 2:07 PM IST

Pawan kalyan on Pushpa 2 : పవన్​ కల్యాణ్​​ ఆ మధ్య చెట్ల నరికివేత, స్మగ్లింగ్‌ గురించి చేసిన కామెంట్స్​ వైరల్​గా మారిన సంగతి తెలిసిందే. ఒకప్పుడు హీరోలు అడవులను కాపాడే వారు. కానీ ఇప్పుడు అడవులను ధ్వంసం చేసేవాళ్లు హీరోలవుతున్నారు అంటూ ఆయన అన్నారు. దీంతో పవన్ ఇన్​డైరెక్ట్​గా 'పుష్ప' మూవీ థీమ్​ గురించి అన్నారని ప్రచారం సాగింది. అప్పటికే మెగా ఫ్యామిలీ - అలు అర్జున్​కు మధ్య విభేదాలు వచ్చినట్లు ప్రచారం సాగడంతో, పవన్​ 'పుష్ప' గురించే అలా అన్నారని వార్తలు వచ్చాయి. ఇది పవర్ స్టార్ - అల్లు అర్జున్ ఫ్యాన్స్ మధ్య పెద్ద వివాదానికి కూడా దారీ తీసింది. ఇంకా ఈ ప్రచారం, వివాదం కొనసాగతూనే ఉంది.

అయితే తాజాగా ఈ విషయమై ఉస్తాద్​ భగత్‌ సింగ్‌ నిర్మాత రవి శంకర్‌ స్పందించారు. చెట్ల నరికివేత, స్మగ్లింగ్​ గురించి రీసెంట్​గా పవన్‌ కల్యాణ్ అన్న కామెంట్స్​ 'పుష్ప 2'ను ఉద్దేశించి కాదని రవి శంకర్‌ స్పష్టత ఇచ్చారు. పవన్​ ఎప్పుడూ కావాలని అలా మాట్లాడరని క్లారిటీ ఇచ్చారు. మెగా ఫ్యామిలీ అంతా ఒక్కటేనని ఆయన చెప్పుకొచ్చారు. పుష్ప-2 సినిమా డిసెంబరు 6న కచ్చితంగా రిలీజ్ అవుతుందని చెప్పారు.

అలానే తమ బ్యానర్​తో తెరకెక్కుతోన్న మరో చిత్రం 'ఉస్తాద్‌ భగత్​ సింగ్'​​ గురించి కూడా అప్డేట్ ఇచ్చారు. "ఈ మధ్యే పవన్‌ కల్యాణ్‌ను కలిశాను. త్వరలోనే 'ఉస్తాద్‌ భగత్‌సింగ్‌' షూటింగ్‌ ప్రారంభిస్తాం. డిసెంబర్‌, జనవరి నాటికి షూ పూర్తి చేయాలని ప్లాన్‌ చేసుకున్నాం. సెప్టెంబర్‌ 2 పవన్‌ పుట్టిన రోజు నాడు మా టీమ్​ నుంచి ఓ సర్‌ప్రైజ్‌ కచ్చితంగా ఉంటుంది" అని అన్నారు.

NTR Prasanth Neel Movie Shooting : ఇంకా ఎన్టీఆర్​ - ప్రశాంత్​ నీల్‌ సినిమా గురించి కూడా అప్డేట్ ఇచ్చారు. ఈ మూవీ షూటింగ్‌ అక్టోబర్‌లో ప్రారంభించనున్నట్లు చెప్పారు. ఎన్టీఆర్‌ డిసెంబర్‌ నుంచి ఈ మూవీ షూటింగ్​లో పాల్గొంటారని పేర్కొన్నారు. ఈ చిత్రం 2026 జనవరి 9న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్​ కానుంది.

ఎస్​ జే సూర్య - 'వస్తాడు, సైకోయిజంతో అలరిస్తాడు, రిపీట్​' - SJ Suryah Saripoda Sanivaram

అసెంబ్లీలో చర్చలు, రెండు నెలల పాటు నిషేధం - బాలయ్య తొలి సినిమా 'తాతమ్మ కల' విశేషాలివే! - Balakrishna 50 Years Tatamma Kala

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.