Pawan Kalyan OG Title : టాలీవుడ్ స్టార్ హీరో, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం అటు సినిమాలతో పాటు రాజకీయాలతో బిజీగా ఉన్నారు. ఆయన చేతిలో ప్రస్తుతం 'హరిహర వీరమల్లు', 'ఉస్తాద్ భగత్ సింగ్'తో పాటు 'ఓజీ' సినిమాలు ఉన్నాయి. ఇవన్నీ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. అయితే తాజాగా సుజీత్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఓజీ మూవీ గురించి ఓ లేటెస్ట్ అప్డేట్ నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది. ఈ సినిమాకు ఓ పవర్ఫుల్ టైటిల్ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.
తొలుత ఈ మూవీ వర్కింగ్ టైటిల్ అయిన 'ఓజీ'ని అందరూ 'ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్' అని అనుకున్నారు. కానీ దాని అర్థం 'ఓజాస్ గంభీర' అని తెలిసింది. దీంతో దీన్నే టైటిల్గా ఫిక్స్ చేస్తే బాగుంటుందని మేకర్స్ అనుకున్నారట, కానీ ఈ సినిమాకు మరింత సాలిడ్ టైటిల్ను మూవీ టీమ్ డిసైడైందని సమాచారం.
అయితే తాజాగా ఈ చిత్ర నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ కొత్తగా 'హంగ్రీ చీతా' అనే టైటిల్ను రిజిస్టర్ చేయించిందట. దీంతో ఈ టైటిల్ గురించి చర్చలు మొదలయ్యాయి. మరోవైపు ఓజీ మేకర్స్ మాత్రం ఈ సినిమాకు 'They Call Him OG' అనే టైటిల్నే ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. దీంతో ఫ్యాన్స్ కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఈ రెండింట్లో మేకర్స్ దేన్ని ఫిక్స్ చేస్తారన్న విషయం గురించి డిస్కషన్ పెట్టారు. అయితే మేకర్స్ క్లారిటీ ఇస్తేకానీ అసలు విషయం తెలియదు.
Pawan Kalya OG Cast : ఇక ఓజీ సినిమా విషయానికి వస్తే - 'సాహో' తర్వాత సుజిత్ తెరకెక్కిస్తున్న సినిమా ఇది. ఇందులో పవన్ కల్యాణ్ ఓ సీరియస్ గ్యాంగ్‌స్టర్‌గా కనిపించనున్నారు. ఇటీవలే విడుదలైన సాలిడ్ గ్లింప్స్ ఆడియెన్స్‌ను ఎంతో ఆకట్టుకుంది. ముఖ్యంగా ఆయన మరాఠీలో మాట్లాడి ఈ సినిమాపై మరింత ఇంట్రెస్ట్ పెంచారు. ఇందులో పవన్ సరసన 'గ్యాంగ్లీడ్ర్ ఫేమ్' కోలీవుడ్ బ్యూటీ ప్రియాంక మోహన్ నటిస్తుండగా, అర్జున్ దాస్, శ్రియ రెడ్డి, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో ఇమ్రాన్ హష్మీ విలన్గా కనిపించనున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
గేమ్ ఛేంజర్, ఓజీ : బాబాయ్ - అబ్బాయ్ బాక్సాఫీస్ క్లాష్!
పవన్ ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్ - 'ఓజీ' నుంచి పవర్ఫుల్ అప్డేట్