Pawan Kalyan Hari hara veera mallu Teaser : అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పవన్ కల్యాణ్ హరిహర వీరమల్లు నుంచి ఫ్యాన్స్‌కు సర్ప్రైజ్ అప్డేట్ ఇచ్చింది మూవీటీమ్. ముందుగా చెప్పినట్టుగానే టీజర్‌ను విడుదల చేసిన చిత్రబృందం ఈ సినిమా రెండు భాగాలుగా రానున్నట్లు అనౌన్స్ చేసింది. ధర్మం కోసం యుద్ధం అంటూ తొలి భాగం ఈ ఏడాది 2024లో రానున్నట్లు క్లారిటీ ఇచ్చింది. స్వార్డ్ వర్సెస్ స్పిరిట్(కత్తి వర్సెస్ ఆత్మ) అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది. అలానే ఓ పోస్టర్‌ను కూడా విడుదల చేసింది. ఇందులో పవన్ నల్ల తోడేలు ఎదురెదురుగా ఒకరి కళ్లలోకి మరొకరు సూటిగా చూస్తుకుంటున్నట్లుగా చూపించారు.
టీజర్లో మొఘలుల కాలంలో రాజులు, నవాబులు ప్రజలపై దాడి చేస్తూ వారి శ్రమను దోచుకుంటుంటే - వాళ్లను దోచుకోవడానికి ఓ దొంగ వస్తాడు అంటూ టీజర్లో పవన్ ఇంట్రడక్షన్ అదిరింది. చాలా కాలం తర్వాత పవర్ ఫుల్ యాక్షన్ సీన్స్‌తో పవన్ అదరగొట్టేశారు. పవన్ లుక్స్ హైలైట్‌గా ఉన్నాయి. మొత్తంగా ఈ ప్రచారం చిత్రంలో యాక్షన్, విజువల్స్, బ్యాగ్రౌండ్ స్కోర్ అంతా బాగున్నాయి. దీంతో ఈ టీజర్ కాసేపట్లోనే తెగ వైరల్ అవుతోంది.
కాగా, గత కొంతకాలం క్రితం ఈ సినిమాకు సంబంధించి ఎటువంటి అప్డేట్స్ రాకపోవడం వల్ల ఈ సినిమా ఆగిపోయిందంటూ సోషల్ మీడియాలో అనేక వార్తలు వచ్చాయి. కానీ వాటికి చెక్ పెడుతూ చిత్ర నిర్మాత ఏఎమ్ రత్నం సినిమాపై క్లారిటీ ఇచ్చారు. అలాగే కొన్ని అప్డేట్స్ను కూడా విడుదల చేశారు.
Harihara Veeramallu Cast : ఈ సినిమా 17వ శతాబ్దం నేపథ్యంలో సాగే కథ. మొఘలుల కాలం నాటి చారిత్రక నేపథ్యంలో తెరకెక్కుతోంది. పవన్ కల్యాణ్ ఓ వీరోచిత బందిపోటుగా కనిపిస్తారట. ఇప్పటికే విడుదలైన ఆయన లుక్స్ కూడా ఫ్యాన్స్‌ను బాగా ఆకట్టుకున్నాయి. యంగ్ బ్యూటీ నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తోంది. బాలీవుడ్ స్టార్ యాక్టర్, యానిమల్ ఫేమ్ బాబీ దేవోల్ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. కీరవాణి స్వరాలు సమకూరుస్తున్నారు.
వారి సరసన పవన్ - బాహుబలితో మొదలైన రెండు భాగాల ట్రెండ్‌ను స్టార్ హీరోలు అంతా ఫాలో అయిపోతున్నారు. ఇప్పటికే సలార్, దేవర కూడా రెండు భాగాలుగా అనౌన్స్ చేశారు. ఇప్పుడు వీళ్ళ బాటలోనే పవన్ కూడా హరిహర వీరమల్లు సినిమాను రెండు పార్టులుగా అనౌన్స్ చేయడం ఫ్యాన్స్‌లో మరింత ఆసక్తిని పెంచింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఆరు భాషల్లో 'పుష్ప పుష్ప' సాంగ్ - ఎలా ఉందంటే ? - Pushpa 2 Title Song
మొటిమలకు సాయి పల్లవి సర్జరీ - ఆమె సమాధానమిదే! - Saipallavi Pimples