ETV Bharat / entertainment

'ఆ అద్భుతాలు నువ్వు మాత్రమే చేయగలవు' - పవన్​కు 'అన్నయ్య' స్పెషల్ విషెస్ - Pawan Kalyan Birthday - PAWAN KALYAN BIRTHDAY

Pawan Kalyan Birthday Wishes : పవర్ స్టార్ పవన్ కల్యాణ్​ బర్త్​డే సందర్భంగా ఆయన అభిమానులతో పాటు సినీ సెలబ్రిటీలు కూడా సోషల్ మీడియా వేదికగా స్పెషల్ విషెస్ తెలుపుతున్నారు. ఆ విశేషాలు మీ కోసం.

Pawan Kalyan Birthday Wishes
Pawan Kalyan Birthday Wishes (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 2, 2024, 10:17 AM IST

Pawan Kalyan Birthday Wishes : పవర్ స్టార్ పవన్ కల్యాణ్​ బర్త్​డే సందర్భంగా ఆయన అభిమానులతో పాటు సినీ సెలబ్రిటీలు కూడా సోషల్ మీడియా వేదికగా స్పెషల్ విషెస్ తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో పవన్ అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి కూడా నెట్టింట ఓ స్పెషల్ పోస్ట్ షేర్ చేశారు.

"కల్యాణ్‌ బాబు. ప్రతీ సంవత్సరం నీకు పుట్టినరోజు వస్తుంటుంది. కానీ, ఈ పుట్టినరోజు మరీ ప్రత్యేకం. ఆంధ్ర ప్రజానీకానికి కావలసిన సమయంలో కావాల్సిన నాయకుడు వాళ్ల జీవితంలో పెను మార్పులు తీసుకురావడానికి వాళ్ల ఇంటి పెద్ద బిడ్డగా వచ్చాడు. రాజకీయాల్లో నీతి, నిజాయితీ, నిలకడ, నిబద్ధత కలిగిన ఒక నాయకుడిగా నిన్ను వాళ్ల జీవితాల్లోకి ఆహ్వానించారు. గుండెల్లో స్థానం ఇచ్చారు. అది సుస్థిరం. ఈ రోజుల్లో నీలాంటి నాయకుడు కావాలి, రావాలి. అద్భుతాలు జరగాలి. అది నువ్వు మాత్రమే చేయగలవు, చేస్తావనే నమ్మకం నాతో పాటు ఆంధ్ర ప్రజలందరికీ ఉంది. పుట్టిన రోజు శుభాకాంక్షలు. దీర్ఘాయుష్మాన్ భవ!" అంటూ తమ్ముడ్ని ఆశీర్వదించారు చిరు.

మీరు చేసే సాయం నాలో స్ఫూర్తినింపుతాయి
తన బాబయ్​ పుట్టిన రోజున గ్లోబల్​ స్టార్ రామ్​ చరణ్​ కూడా సోషల్ మీడియా వేదికగా ఆయనకు స్పెషల్​గా విష్​ చేశారు. దీంతో పాటు పవన్​కు సంబంధించిన ఓ రేర్​ ఫొటోను అభిమానులతో పంచుకున్నారు.

"మా పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. మీ బలం, అంకితభావం, అవసరం ఉన్న వారికి చేసే సాయం నాలో స్ఫూర్తి నింపుతాయి. ప్రజలకు సామాజిక న్యాయం అందించడం కోసం మీ నిస్వార్థమైన సేవలు, మీ నాయకత్వం, నిబద్ధతతో చేసే శ్రమ అందరికీ స్ఫూర్తి. దేవుడు మీకు మరింత బలాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నా" అంటూ చెర్రీ రాసుకొచ్చారు.

ప్రజల ఆశలకు, ఆశయాలకు ఆయువు పోస్తూ.. ఆహర్నిశలు శ్రమిస్తున్న ఆంధ్రప్రదేశ్‌ ఉపముఖ్యమంత్రివర్యులు పవన్‌ కల్యాణ్‌కు నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు - టాలీవుడ్ డైరెక్టర్ హరీశ్‌ శంకర్‌

శ్రామికుడు, సమర్థుడు, ప్రజల మనిషి పవన్‌ కల్యాణ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు - సీనిరర్ రచయిత పరుచూరి గోపాలకృష్ణ

పవన్‌ ఫ్యాన్స్ అర్థం చేసుకోండి : ప్రముఖ నిర్మాణ సంస్థల విజ్ఞప్తి - Pawan Kalyan Birthday Special

పవర్ స్టార్ ఫ్యాన్స్​కు నిరాశ- 'OG' గ్లింప్స్​ పోస్ట్​పోన్! - Pawan Kalyan OG

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.