Pawan Kalyan Birthday Special Movie Updates : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ బర్త్‌డే సందర్భంగా ఆయన అప్‌కమింగ్ సినిమాలకు సంబంధించిన అప్‌డేట్స్ ప్రకటిస్తామంటూ నిర్మాణ సంస్థలు ఇటీవల ప్రకటించాయి. అయితే తాజాగా వాటిని రద్దు చేస్తున్నట్లు ఆయా సంస్థలు తెలిపాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో వరదల కారణంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని నేడు (సెప్టెంబర్ 2) విడుదల కావాల్సిన అప్‌డేట్స్‌ను క్యాన్సిల్ చేస్తున్నట్లు వెల్లడించాయి. అయితే ఇప్పటికే ఓజీ మేకర్స్ ఈ విషయాన్ని తెలిపిన సంగతి తెలిసిందే.
అర్థం చేసుకోండి
పవర్ స్టార్ నటిస్తున్న పీరియాడికల్ యాక్షన్ చిత్రం 'హరిహర వీరమల్లు' నుంచి కూడా ఓ కొత్త పోస్టర్ విడుదల చేయాలని మేకర్స్ భావించారు. అయితే తాజాగా దాన్ని క్యాన్సిల్ చేశారు. 'పవన్ ఫ్యాన్స్ కోసం ఓ ఇంట్రెస్టింగ్ పోస్టర్‌ను డిజైన్ చేశాం. దాన్ని ఈ రోజు రిలీజ్ చేయాలనుకున్నాం. అయితే ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో తీవ్రమైన వరదలతో ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సమయంలో పోస్టర్ రిలీజ్ చేయడమనేది సరికాదని భావిస్తున్నాం. అందరూ అర్థం చేసుకొని మాకు సహకరిస్తారని ఆశిస్తున్నాం" అంటూ నిర్మాణ సంస్థ తాజాగా ప్రకటించింది.
OG సెలబ్రేషన్స్ పోస్ట్‌పోన్
ఇక సెప్టెంబర్ 2న ఆయన పుట్టిన రోజు సందర్భంగా మేకర్స్ ఈ సినిమా నుంచి సాలిడ్ అప్డేట్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. సోమవారం మధ్యాహ్నం సెకండ్ గ్లింప్స్ విడుదల చేయనున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ పవర్ఫుల్ పోస్టర్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. దీంతో ఫ్యాన్స్‌లో అంచనాలు అమాంతం పెరిగిపోయాయి.
తాజాగా మేకర్స్ మరో ప్రకటనతో ఫ్యాన్స్ కాస్త నిరాశ చెందారు. 'పవర్ ప్యాక్డ్ ఫైర్' వేడుకలు మరికొద్ది గంటల్లో ప్రారంభం కానున్నాయి. OG అనేది సినిమా మాత్రమే కాదు. ఇది అందరికీ ఒక వేడుక లాంటిది. ఈ ప్రత్యేకమైన రోజును మరింత గ్రాండ్‌గా సెలబ్రేట్ చేయడానికి చాలా ప్రయత్నించాం. కానీ, భారీ వర్షాల కారణంగా OG సెలబ్రేషన్స్ మరొక రోజుకు పోస్ట్ పోన్ చేస్తున్నాం' అని రాసుకొచ్చారు. అయితే ఫ్యాన్స్ కోసం రేపు ఓ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అలాగే ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ కూడా సోమవారం అనౌన్స్ చేయనున్నట్లు పేర్కొన్నారు.
'నాని, పవన్ కల్యాణ్ మధ్య ఉన్న పోలిక అదే!' : ప్రియాంక మోహన్ - Saripodhaa Sanivaaram Priyanka
ఆ ఫీల్‌గుడ్ లవ్ స్టోరీలో పవన్ నటించాల్సింది! - కానీ ఏం జరిగిందంటే? - Pawankalyan