ETV Bharat / entertainment

'స్పిరిట్'​ బడ్జెట్​పై లేటెస్ట్​ బజ్​ - ఏకంగా ఎన్ని వందల కోట్లంటే? - Spirit Movie Budget

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 18, 2024, 2:19 PM IST

Prabhas Spirit Budget : పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ నుంచి రాబోయే సినిమాల్లో 'స్పిరిట్' కూడా ఒకటి. ప్రస్తుతం ఈ మూవీ బడ్జెట్​ గురించి షాకింగ్ డీటెయిల్స్​ బయటకు వచ్చాయి! పూర్తి వివరాలు స్టోరీలో.

source ETV Bharat IANS
Prabhas Spirit Budget (source ETV Bharat IANS)

Prabhas Spirit Budget : పాన్ ఇండియా రెబల్​​ స్టార్​​ ప్రభాస్ సినిమా అంటే బాక్సాఫీస్​​ ముందు వందల కోట్ల కలెక్షన్స్ పక్కా! అందుకే తమ సినిమాలో రెబల్ స్టార్ ఉంటే చాలు బాక్సాఫీస్ వసూళ్లు కురుస్తాయని నిర్మాతలు ఆయన చిత్రాలపై భారీ బడ్జెట్ పెట్టడానికి వెనకాడటం లేదు. అందుకు తగ్గట్టే ప్రభాస్​ సినిమాల బడ్జెట్​ వందల కోట్ల​తో తెరకెక్కుతున్నాయి. బాహుబలి నుంచి ఆయన చేసే ప్రతీ సినిమా ఇదే స్థాయిలో పెట్టుబడితో రూపొందుతున్నాయి. అందులో అత్యధికంగా ఆదిపురుష్​ ఏకంగా రూ.500 నుంచి రూ.600 కోట్ల బడ్జెట్​తో నిర్మించారు!అనంతరం కల్కి 2898 ఏడీ కోసం కూడా దాదాపు ఇదే స్థాయిలో ఖర్చు పెట్టారు.

అయితే ఇప్పుడు ప్రభాస్ చేయబోయే మరో కొత్త సినిమా కోసం కూడా దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్​ పెట్టబోతున్నట్లు తెలిసింది. అదే స్పిరిట్​. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ చిత్రాలతో హ్యాట్రిక్ సక్సెస్ సాధించిన సందీప్ రెడ్డి దీన్ని తెరకెక్కించనున్నారు. అందుకే ఈ స్పిరిట్​పై భారీ అంచనాలు ఉన్నాయి. దీన్ని బాలీవుడ్ నిర్మాణ సంస్థ టీ సిరీస్​తో కలిసి సందీప్ రెడ్డి​ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్ పవర్​ ఫుల్​ పోలీస్ ఆఫీసర్​గా కనిపించనున్నారట. వచ్చే ఏడాది జనవరిలో మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇకపోతే నెక్ట్స్ ప్రభాస్ నుంచి రాబోయే సినిమాల్లో ఒకటి రాజా సాబ్. దీన్ని కూడా గ్రాండియర్​గానే రూపొందిస్తున్నారు. రూ.400 కోట్ల బడ్జెట్​ అని బయట టాక్ నడుస్తుంది. సలార్, కల్కి 2898 ఏడీ సీక్వెల్స్ బడ్జెట్ కూడా భారీ మొత్తంలో ఉంటాయని అంటున్నారు.

గత సినిమాల బడ్జెట్స్​, కలెక్షన్స్​ - బహుబలి తర్వాత 'సాహో'ను ఏకంగా రూ.350 కోట్ల బడ్జెట్​తో తెరకెక్కించారు. దీనికి బానే వసూళ్లు వచ్చాయట. ఆ తర్వాత దాదాపు రూ.200 కోట్లతో వచ్చిన రాధేశ్యామ్ మాత్రం బోల్తా కొట్టింది. అనంతరం వచ్చిన ఆదిపురుష్ కూడా టాక్​తో పాటు కలెక్షన్స్​ పరంగానూ తీవ్రంగా నిరాశపరిచింది.

కానీ ఆ తర్వాత వచ్చిన సలార్​తో ప్రభాస్​ సక్సెస్ ట్రాక్ ఎక్కారు. ఈ చిత్రం రూ.270 కోట్లతో తెరకెక్కగా ఏకంగా రూ.600 కోట్లకుపైనే వసూళ్లు వచ్చాయి. ఇక కల్కి 2898 ఏడీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దాదాపు రూ.550 కోట్ల బడ్జెట్​తో తెరకెక్కి ఏకంగా రూ.1200 కోట్లకుపైనే ఖాతాలో వేసుకుంది.

దసరా బరిలో ఐదు చిత్రాలు - సినీప్రియుల చూపంతా ఆ సినిమాపైనే! - Tollywood Box Office Dasara 2024

హిందీలో 'స్త్రీ 2' సంచలన కలెక్షన్స్​ - హైయెస్ట్ గ్రాస్​ ఫిల్మ్​గా రికార్డ్​ - Stree 2 Movie Collections

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.