ETV Bharat / entertainment

షాకింగ్​ - ఒక్క సినిమాకే ఆ దర్శకుడికి రెమ్యునరేషన్​ రూ.600కోట్లు! - Oppenheimer Director remuneration

ఓ దర్శకుడు తాను తీసిన సినిమాకు ఏకంగా రూ.600కోట్ల రెమ్యునరేషన్​ అందుకొని చర్చనీయాంశంగా మారాడు. ఇంతకీ అతను ఎవరో తెలుసుకుందాం.

షాకింగ్​ - ఒక్క సినిమాకే ఆ దర్శకుడికి రెమ్యునరేషన్​ రూ.600కోట్లు!

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 9, 2024, 7:44 PM IST

Oppenheimer Director 600 Crores : ఈ రోజుల్లో హీరోహీరోయిన్లే కాదు దర్శకులు ఇతర టెక్నీషియన్లు కూడా భారీగానే క్రేజ్ దక్కించుకుంటున్నారు. అదే విధంగా వారితో సమానంగా రెమ్యునరేషన్లు అందుకునే స్టేజ్​కు ఎదుగుతున్నారు. రాజమౌళి, ప్రశాంత్ నీల్​, లోకేశ్ కనగరాజ్​ ఇలా పలువురు ప్రేక్షకుల్లో భారీ క్రేజ్​ను దక్కించుకోవడంతో పాటు పారితోషికాన్ని పెద్ద మొత్తాన్నే అందుకుంటున్నారు. అయితే ఓ దర్శకుడు మాత్రం రికార్డ్​ స్థాయిలో రెమ్యునరేషన్​ అందుకుని అందరూ నోరెళ్లబెట్టేలా చేశాడు. ఆ మొత్తంతో ఈజీగా చిన్న బడ్డెట్​ సినిమాలు 50 తీసేయొచ్చు అన్న రేంజ్​లో పుచ్చుకున్నాడు.

వివరాల్లోకి వెళితే ఇండియాలో వసూళ్లు అంటే రూ. 1000 నుంచి రూ.1200 కోట్ల వరకు ఉంటుంది. రెమ్యునరేషన్​ అయితే రూ.100 నుంచి రూ.200 కోట్ల వరకు ఉంటుందని చెప్పొచ్చు. కానీ హాలీవుడ్ అలా కాదు. అక్కడి సినిమా బడ్జెట్​, కలెక్షన్లు ఊహకు మించి ఉంటాయి. ఫిల్మ్ మేకర్స్ కూడా​ లాభాల్లో వాటా తీసుకోవడం అక్కడ సర్వసాధారణం. అలా తాను తెరకెక్కించిన ఓ సినిమా వసూళ్లలో వాటా తీసుకోవడం ద్వారానే స్టార్ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ తాజాగా వార్తల్లో హాట్​టాపిక్​గా మారారు. ఇంటర్​ స్టెల్లార్, డన్​కిర్క్, ది డార్క్ నైట్ లాంటి బ్లాక్​బస్టర్స్ తెరకెక్కించిన ఆయన గతేడాది ఓపెన్​హైమర్ అనే చిత్రాన్ని రూపొందించారు.

ఈ చిత్రం గతేడాది బాక్సాఫీస్ ముందుకు వచ్చి భారీ బ్లాక్ బస్టర్​ను సొంతం చేసుకుంది. దాదాపుగా 100 మిలియన్ డాలర్ల బడ్జెట్​తో తెరకెక్కిన ఈ సినిమా 900 మిలియన్ డాలర్లకు పైగా వసూళ్లను సాధించింది. నిర్మాతలకు లాభాలను బాగా తెచ్చిపెట్టింది. 2023లో అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.

ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేసినందుకుగానూ క్రిస్టోఫర్ నోలన్​కు ఏకంగా 72 మిలియన్ డాలర్స్ రెమ్యూనరేషన్​ అందుకున్నారని తెలిసింది. అంటే భారత కరెన్సీలో దాదాపుగా రూ.595 కోట్లు అన్నమాట. ఈ విషయం ప్రస్తుతం ఇండియన్ మూవీ లవర్స్​లో చర్చనీయాంశంగా మారింది. ఇది తెలుసుకుంటున్న ఇండియన్ మూవీ ప్రేక్షకులు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కల్కి 2898 ఏడీ బడ్జెట్ కన్నా ఎక్కువ కదా అంటూ కామెంట్లు చేస్తున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

OTTలో రియల్ క్రైమ్ స్టోరీ - 18 దేశాల్లో టాప్​ ట్రెండింగ్‌!

ఈ వారం టాప్ 10 సిరీస్​ ఇవే - వేరే లెవెల్ థ్రిల్ పక్కా​!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.