ETV Bharat / entertainment

ఆపరేషన్​ వాలెంటైన్ - చిరుతో కలిసి వరుణ్ తేజ్​ చైల్డ్​ ఆర్టిస్ట్​గా నటించిన సినిమా తెలుసా? - చిరుతో కలిసి వరుణ్ తేజ్ సినిమా

Operation Valentine Varun Tej Child Artist Movie :  త్వరలోనే ఆపరేషన్ వాలెంటైన్ చిత్రంతో ప్రేక్షకుల్ని పలకరించనున్న మెగా హీరో వరుణ్ తేజ్​ - చైల్డ్ ఆర్టిస్ట్​గా నటించారని మీకు తెలుసా? అది కూడా చిరంజీవితో కలిసి. ఇంతకీ ఆ చిత్రం ఏంటంటే?

ఆపరేషన్​ వాలెంటైన్ - చిరుతో కలిసి వరుణ్ తేజ్​ చైల్డ్​ ఆర్టిస్ట్​గా నటించిన సినిమా తెలుసా?

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 27, 2024, 7:29 AM IST

Operation Valentine Varun Tej Child Artist Movie : మెగా ప్రిన్స్ వరుణ్​ తేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మెగా హీరో ట్యాగ్​ లైన్​తో పెదనాన్న చిరంజీవి ఆశీస్సులతో నాగబాబు తనయుడిగా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ముకుంద చిత్రంతో హీరోగా పరిచయమైన ఆయన ఆ తర్వా కంచెతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకుని ఫిదాతో తొలి కమర్షియల్ హిట్​ను అందుకున్నారు. నటించిన తొలి సినిమానే యావరేజ్​గా ఆడినప్పటికీ తన సినిమాల సెలక్షన్​తో మెగా ఫ్యాన్స్​ చూపును తన వైపునకు తిప్పుకున్నారు. ఇక గద్దల కొండ గణేశ్​తో భారీ సక్సెస్​ను అందుకుని మెగా వారసుడు అనిపించుకున్నారు.

అయితే మెగా హీరోల్లో అల్లు అర్జున్, అల్లు శిరీష్, వైష్ణవ్ తేజ్ లాంటి హీరోలు తమ చిన్నప్పుడే సినిమాల్లో మెరిశారు. అల్లు అర్జున్ చిరంజీవి విజేతతో పాటు మరో చిత్రంలో నటిస్తే, వైష్ణవ్ తేజ్ జానీ, శంకర్ దాదా mbbs, అందరివాడు చిత్రాల్లో చైల్డ్​ ఆర్టిస్ట్​గా కనిపించారు. ఇక రామ్ చరణ్ చిన్నప్పుడు ఎప్పుడూ కనిపించలేదు. అయితే వరుణ్ తేజ్ ఒక సినిమాలో బాలనటుడిగా కనిపించారని మీకు తెలుసా? చాలా మందికి ఈ విషయం తెలియదు.

వరుణ్​ - ప్రముఖ నటి జయసుధతో పాటు నాగబాబు, బ్రహ్మానందం ప్రధాన పాత్రల్లో నటించిన హ్యాండ్సప్ చిత్రంలో ఉన్నారు. ప్రముఖ దర్శకుడు శివ నాగేశ్వర రావు ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఇందులో మెగాస్టార్ చిరంజీవి స్పెషల్ అప్పియరెన్స్ ఇచ్చారు. క్లైమాక్స్​లో ప్రముఖ నటుడు సోనూసూద్ కూడా చిన్న విలన్​ పాత్రలో కనిపిస్తారు. ఈ చిత్రంతోనే ఆయన టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. అయితే ఈ సినిమా క్లైమాక్స్​లోనే వరుణ్ తేజ్ కూడా చిన్న పాత్రలో కనిపిస్తారు. చిరుతో కలిసి ఆయనకు రెండు నిమిషాల సీన్ ఉంటుంది. అయితే ఈ హ్యాండ్సప్ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో ఆడలేదు.

కాగా, వరుణ్ తేజ్ రీసెంట్​గా గాండీవధారి అర్జునతో ప్రేక్షకుల్ని పలకరించారు. కానీ ఇది బోల్తా కొట్టింది. ఇక ఇప్పుడు మార్చి 1న భారత ఎయిర్ ఫోర్స్ ఆర్మీ బ్యాక్​డ్రాప్​తో తెరకెక్కిన ఆపరేషన్​ వాలెంటైన్ చిత్రంతో థియేటర్లలో సందడి చేయనున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

సాయి పల్లవితో మళ్లీ నటించకపోవడానికి కారణం అదే: వరుణ్ తేజ్

SSMB29 : మహేశ్‌, రాజమౌళి సినిమా - ఆ ఐదు పనులు పూర్తైతేనే మూవీ షురూ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.