Ooru Peru Bhairavakona Day 1 Collections : టాలీవుడ్లో చాలా కాలం నుంచే హీరోగా సినిమాలు చేస్తున్నప్పటికీ సరైన హిట్లు లేక ఇబ్బంది పడుతున్న వారిలో సందీప్ కిషన్ ఒకరు. తాజాగా ఆయన నటించిన సోషియో ఫాంటసీ 'ఊరు పేరు భైరవకోన' సినిమా థియేటర్లలో విడుదలైంది. వీఐ ఆనంద్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాతో చాలా కాలం తర్వాత సందీప్ కిషన్ కెరీర్లో చెప్పుకోదగ్గ హిట్ వచ్చి పడింది. సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఓపెనింగ్ కలెక్షన్స్ కూడా ఆశించిన దానికన్నా మంచిగానే వచ్చాయి.
బిజినెస్ జరిగిందిలా :
ఈ 'ఊరు పేరు భైరవకోన' సినిమాకు నైజాంలో రూ. 3 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.30 కోట్లు, ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ఏరియాలు కలిపి రూ. 4.40 కోట్ల బిజినెస్ జరిగింది. అలా తెలుగులో రూ.19.50 కోట్ల వ్యాపారం జరిగింది. ఇక రెస్టాఫ్ ఇండియా, కర్నాటక, ఓవర్సీస్ అన్నీ ఏరియాల్లో కలిపి రూ. 1.50 కోట్ల వరకు అమ్ముడుపోయిందని ట్రేడ్ వర్గాల ద్వారా తెలిసింది.
తొలి రోజు ఎన్ని కోట్లంటే అసలీ సినిమా మొదట నుంచి హీరో ఇమేజ్‌తో కాకుండా పోస్టర్లు ఇతర ప్రచార చిత్రాల ద్వారా బాగానే ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. సినిమాకు పబ్లిక్ రేటింగ్ ప్రకారం బుక్ మై షోలో 9.1 స్టార్, పేటీఎమ్‌లో 96శాతం, ఐఎమ్‌డీబీలో 9.2 స్టార్లు వచ్చాయి. అలానే ఇప్పుడూ సినిమాకు తొలి రోజు అనుకున్న దాని కన్నా ఎక్కువగానే రెస్పాన్స్ వచ్చింది.
ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలనూ కలుపుకుని రూ.6.03కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. సందీప్ కిషన్ కెరీర్లో ఇది భారీ ఓపెనింగ్స్ అని చెప్పాలి. దీంతో సందీప్ కిషన్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.ఇకపోతే ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండ, అనిల్ సుంకర నిర్మించారు. సినిమాలో వర్ష బొల్లమ్మ, కావ్య థాపర్ హీరోయిన్లుగా నటించారు. శేఖర్ చంద్ర సంగీతం అందించారు. వెన్నెల కిశోర్, హర్ష, రవి శంకర్ ఇతర కీలక పాత్రల్లో నటించారు.