ETV Bharat / entertainment

ఓం భీమ్​ బుష్​ - బాక్సాఫీస్​ ముందు ఊతకొట్టుడే! - OM BHEEM BUSH COLLECTIONS - OM BHEEM BUSH COLLECTIONS

Om Bheem Bush Collections :శ్రీవిష్ణు హీరోగా నటించిన ఓం భీమ్ బుష్ మొదటి వీకెండ్​లో థియేటర్ కలెక్షన్ అదరగొట్టింది. ఇంతకీ ఈ చిత్రం నాలుగు రోజుల్లో ఎన్ని కోట్లు అందుకుందో తెలుసుకుందాం.

ఓం భీమ్​ బుష్​ - బాక్సాఫీస్​ ముందు ఊతకొట్టుడే!

author img

By ETV Bharat Telugu Team

Published : Mar 26, 2024, 12:55 PM IST

Om Bheem Bush Collections : శ్రీవిష్ణు హీరోగా నటించిన ఓం భీమ్ బుష్ గత వారం విడుదల అయినప్పటి నుంచి ప్రేక్షకుల నుంచి వస్తున్న పాజిటివ్ రెస్పాన్స్​తో థియేటర్లు నిండుతున్నాయి. శ్రీవిష్ణుతో పాటు ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, ప్రీతి ముకుందన్, ఆయేషా ఖాన్, శ్రీకాంత్ అయ్యంగార్ ప్రధాన పాత్రలలో నటించగా అధిత్య మీనన్, రచ్చ రవి తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. ఈ సినిమాలో సీన్లు కూడా కొన్ని వైరల్​గా మారి సినిమాకు మరింత క్రేజ్​ను పెంచాయి.

సామాజవరగమన లాంటి కామెడీ హిట్ తర్వాత శ్రీవిష్ణు ఈ కామెడీ హారర్ థ్రిల్లర్​తో మరో బ్లాక్ బస్టర్ హిట్​ను సొంతం చేసుకున్నారు. తన మొదటి సినిమా రౌడీ బాయ్స్​తో హిట్ కొట్టలేకపోయినా డైరెక్ట్ చేసిన రెండో సినిమా మాత్రం సూపర్ హిట్ అనిపించుకున్నారు ఈ చిత్ర దర్శకుడు శ్రీ హర్ష కొనుగంటి. ఈ సినిమాకు సన్నీ MR సంగీతం అందిస్తే, వి. సెల్యులాయిడ్, సునీల్ బలుసు నిర్మాతలుగా వ్యవహరించారు.

ఈ సినిమా విడుదల అయ్యి 4 రోజులు దాటింది. మొదటి రోజు కలెక్షన్ 4.6 కోట్లు వస్తే, రెండో రోజు 5.84 కోట్ల కలెక్షన్ వచ్చింది. ఇక తర్వాత వీకెండ్​తో పాటు పండగ సెలవు కూడా రావడం ఇంకా విద్యార్థులకు పరీక్షలు అయిపోయి సెలవులు ఇవ్వడం ఈ సినిమాకు బాగా కలిసి వచ్చింది. అలా మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు 21.75కోట్లు వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు USAలో కూడా ఈ సినిమా వసూళ్ల వర్షం కురిపిస్తుందని ఈ సినిమా టీం సోషల్ మీడియా ద్వారా తమ ఆనందాన్ని వ్యక్తం చేసింది.

ఇంకా ముందు ముందు వేసవి సెలవులు కారణంగా ఈ సినిమాకు పెట్టిన బడ్జెట్​కు మరింత లాభాలు వచ్చే అవకాశం ఉంది. మరో రెండు వారాల తర్వాత విడుదల అయ్యే విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ సినిమా తప్ప మరో పెద్ద సినిమా లేకపోవడం ఈ సినిమాకు బాగా కలిసివస్తుంది.

కళ్లు చెదిరిపోయాయి వర్మ - 53ఏళ్ల వయసులో రమ్యకృష్ణ అందాలు వేరే లెవల్​! - Ramya Krishna photoshoot

'నా అవసరాన్ని, ఆకలిని తీర్చింది వారిద్దరే' - హైపర్ ఆది ఎమోషనల్​ - Jabardasth Comedian Hyper Aadiఓం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.