ETV Bharat / entertainment

'దేవర' ట్రైలర్ వచ్చేసిందహో - ఎన్టీఆర్ మాస్ ఊచకోత - గూస్ బంప్సే - Devara Movie Trailer - DEVARA MOVIE TRAILER

NTR Devara Movie Trailer : అభిమానులు, సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న యంగ్ టైగర్​ ఎన్టీఆర్ 'దేవర' ట్రైలర్ వచ్చేసింది. దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన ఈ పాన్‌ ఇండియా చిత్రం ఈ నెల 27న భారీ స్థాయిలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్​లో భాగంగా ట్రైలర్​ను విడుదల చేశారు మేకర్స్‌.

source ETV Bharat
NTR Devara Movie Trailer (source ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 10, 2024, 5:18 PM IST

Updated : Sep 10, 2024, 5:46 PM IST

NTR Devara Movie Trailer : అభిమానులు, సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న యంగ్ టైగర్​ ఎన్టీఆర్ 'దేవర' ట్రైలర్ వచ్చేసింది. దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన ఈ పాన్‌ ఇండియా హై ఓల్టేజ్ యాక్షన్ చిత్రం ఈ నెల 27న భారీ స్థాయిలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్​లో భాగంగా ట్రైలర్​ను విడుదల చేశారు మేకర్స్‌.

మొదట గ్లింప్స్​లో 'ఈ సముద్రం చేపల్ని కన్నా కత్తుల్ని, నెత్తుర్ని ఎక్కువ చూసుండాది. అందుకే ఏమో దీన్ని ఎర్ర సముద్రం అంటారు' అంటూ ఎన్టీఆర్ చెప్పారు. ఇప్పుడా నెత్తురి వేట, ఎన్టీఆర్ కత్తి వేటు ఎలా ఉంటుందో ట్రైలర్​లో చూపించారు కొరటాల శివ.

"కులం లేదు, మతం లేదు, భయం అసలే లేదు. ధైర్యం తప్ప ఏమీ తెలియని కళ్లలో, మొదటి సారి భయం పొరలు కమ్ముకున్నాయి. రక్తంతో సంద్రమే ఎరుపెక్కిన కథ, మా దేవర కథ" అంటూ బ్యాక్​గ్రౌండ్​లో ప్రకాశ్ రాజ్ వాయిస్ ఓవర్​తో ఎన్టీఆర్​కు యాక్షన్ ఎలివేషన్​ ఇస్తూ ట్రైలర్​ను ప్రారంభించారు.

ఆ తర్వాత "మనిషికి బ్రతికేంత ధైర్యం చాలు. చంపేంత ధైర్యం కాదు. కాదు కూడదు అని మళ్లీ మీరు ఆ ధైర్యాన్ని కూడగడితే, ఆ ధైర్యాన్ని చంపే భయాన్ని అవుతా." అంటూ ఎన్టీఆర్ చెప్పే డైలాగ్​ బాగుంది.

ఈ చిత్రంలో ఎన్టీఆర్​ తండ్రి కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు తాజా ట్రైలర్​తో క్లారిటీ వచ్చేసింది. ఇందులో ఎన్టీఆర్ యాక్షన్​ సీక్వెన్స్​, నటన, డైలాగ్స్ అదరహో అనిపించేలా ఉన్నాయి. తారక్​, కొరటాల శివ కాంబోలో తెరకెక్కిన హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ ఇది

Saif Ali Khan Devara : విలన్ ఎంత బలవంతుడైతే హీరోయిజం కూడా అంతలా ఎలివేట్ అవుతుంది అని ఫార్ములాను చూపించే దర్శకుడు కొరటాల దేవర సినిమాలోనూ అదే చూపించారు. సినిమాలో భైరా పాత్రలో బాలీవుడ్​ స్టార్ సైఫ్ అలీ ఖాన్ నటించారు. ఆయన పాత్రకు ఈ ట్రైలర్‌లో మంచి స్పేస్ దక్కింది.

Last Updated : Sep 10, 2024, 5:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.