Devara Movie Second Song : జూనియర్ ఎన్టీఆర్ - జాన్వీ కపూర్ కలిసి నటిస్తున్న లేటెస్ట్ మూవీ దేవర. ఆర్ఆర్ఆర్ వంటి భారీ హిట్ తర్వాత తారక్ నుంచి వస్తున్న సినిమా కావడం వల్ల అందరిలోనూ ప్రత్యేక ఆసక్తి నెలకొంది. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. సెప్టెంబరు 27న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే రిలీజైన గ్లింప్స్, ఫియర్ సాంగ్ ఫ్యాన్స్‌తో పాటు మూవీ లవర్స్‌ను బాగా ఆకట్టుకున్నాయి. ఒక్క సాంగ్‌తోనే(ఫియర్) సినిమాలో ఏ స్థాయిలో రక్తపాతం ఉంటుందో స్పష్టత ఇచ్చారు మేకర్స్. అనిరుధ్ స్వరపరిచిన ఈ పాట ఇప్పటికీ ఉర్రూతలూగిస్తూనే ఉంది. దీంతో అంచనాలు మరింత పెరిగాయి.
ఈ క్రమంలోనే తాజాగా మువీటీమ్ సెకండ్ సాంగ్‌ను(చుట్టమల్లె) సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేసింది. ఈ పాటలో ఎన్టీఆర్- జాన్వీ జోడీ ఆకట్టుకునేలా ఉంది. మెలోడియస్ సాగిన ఈ సాంగ్ శ్రోతలను ఒక ట్రాన్స్‌లోకి తీసుకెళ్లిందనే చెప్పాలి. శిల్పా రావు వోకల్స్, రామజోగయ్య శాస్త్రీ సాహిత్యం ఫ్రెష్‌గా అనిపించింది. అలానే అనిరుధ్ రవిచందర్ కూడా మెలోడియస్ ట్యూన్‌ను కంపోజ్ చేశాడు.
అలా ఫియర్ సాంగేమో ఎక్స్‌ట్రీమ్ ఫాస్ట్ బీట్, చుట్టమల్లే సాంగ్ ఏమో స్లోగా, ఒక మెలోడియస్ ఫీలింగ్‌ను కలిగిస్తున్నాయి. ఇకపోతే ఈ రెండో సాంగ్‌లో ఎన్టీఆర్ ఎంతో స్టైలిష్‌గా కనిపిస్తున్నారు. జాన్వీ ఎప్పటిలానే ఎంతో అందగా కనిపించింది. మొత్తానికి ఈ రెండో పాటతో కూడా సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోయాయి.
Devara Movie Story : కాగా, సముద్రతీరం నేపథ్యంలో సాగే యాక్షన్ డ్రామాగా దేవర రూపొందుతోంది. సినిమాలో తారక్ వందల మంది శత్రు సైన్యంతో పోరాడి రక్త పాతం సృష్టించబోతున్నారని అంటున్నారు. తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేయనున్నారని కూడా అంటున్నారు. బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. శ్రీదేవి గారాల పట్టి జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. కీలక పాత్రలో శ్రీకాంత్ కనిపించనున్నారు. ఈ చిత్రం రెండు భాగాలుగా రానుంది.
'ఆ పని నేర్చుకునేందుకు ఎన్టీఆర్‌కు ఒక్క సెకను - నాకైతే 10 రోజులు' - Janhvi Kapoor Jr NTR
రాజమౌళి డాక్యుమెంటరీ హైలైట్స్- జక్కన్నను కార్తికేయ అలా పిలిచేవారంట! - Rajamouli Documentary