ETV Bharat / entertainment

దేవర నుంచి కిక్కిచ్చే అప్డేట్ - మరోసారి ఆ హిట్ ఫార్ములాతో! - devara dual role

NTR Devara Movie : ఎన్టీఆర్ దేవర సినిమా నుంచి మరో కిక్కిచ్చే అప్డేట్ వచ్చింది. దాని గురించే ఈ కథనం..

దేవర నుంచి కిక్కిచ్చే అప్డేట్ - మరోసారి ఆ హిట్ ఫార్ములాతో!

author img

By ETV Bharat Telugu Team

Published : Feb 12, 2024, 1:51 PM IST

NTR Devara Movie : యంగ్ టైగర్​ ఎన్టీఆర్‌, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో రూపొందుతున్న సీ బేస్డ్​ యాక్షన్‌ డ్రామా మూవీ దేవర.(Devara). ప్రేక్షకులు, నందమూరి అభిమానులు ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికరమైన అప్డేట్ వచ్చింది. దాని గురించే ఈ కథనం..

ఎన్టీఆర్​ ఈ పేరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర్లేని పేరు. సీనియర్‌ ఎన్టీఆర్‌ వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని నటనలో స్టార్ హీరోగా ఎదిగారు. రౌద్రం, వీరం, బీభత్సం, శాంతం, కరుణ, హాస్యం ఇలా నవరసాలను అలవోకగా పండించగలుగుతారు. అలాగే ద్విపాత్రాభినయం, త్రిపాత్రాభినయం కూడా బాగా చేస్తారు. ఇప్పటికే ఆంధ్రావాలా, అదుర్స్​ వంటి చిత్రాల్లో ద్విపాత్రాభినయం చేసిన ఆయన జై లవకుశలో త్రిపాత్రాభినయంతో అదరగొట్టేశారు. ఆంధ్రావాలాలో తండ్రీకొడుకులుగా కనిపించారు.

అయితే ఇప్పుడు మరోసారి తండ్రీ కొడుకులుగా తారక్​ కనిపించబోతున్నారని తెలుస్తోంది. అదీ దేవర సినిమాలో. ఇప్పటికే తండ్రీ కొడుకుల సెంటిమెంట్‌తో మిర్చి సినిమాను తెరకెక్కించి బాక్సాఫీస్‌ వద్ద భారీ సక్సెస్​ను అందుకున్నారు దర్శకుడు కొరటాల శివ. ఇప్పుడదే కాన్సెప్ట్‌తో దేవరను కూడా కొరటాల శివ తీర్చిదిద్దుతున్నారని టాక్‌ వినిపిస్తోంది. ఇందులోనే ఎన్టీఆర్‌ తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నారని ప్రచారం సాగుతోంది.

రెండు భాగాలుగా ఈ సినిమా తెరకెక్కనుంది. ఇప్పటికే తొలి భాగానికి సంబంధించి తారక్ లుక్​ను విడుదల చేశారు మేకర్స్. ఇక సీక్వెల్​లో తండ్రి పాత్ర నిడివి ఎక్కువగా ఉంటుందని తెలిసింది. మరి ఇందులో ఆయన లుక్ ఎలా ఉంటుందో. ఇంకా సెకండ్ పార్ట్​కు సంబంధించిన స్క్రిప్ట్‌ వర్క్‌ కూడా పూర్తైనట్లు సమాచారం అందింది. కానీ ఈ విషయాలకు సంబంధించి మూవీటీమ్​ నుంచి ఎలాంటి అఫీషియల్ అనౌన్స్​మెంట్ రాలేదు.

కాగా, దేవర సముద్రతీర నేపథ్యంలో సాగే యాక్షన్‌ డ్రామాగా రూపొందుతోంది. పాన్‌ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్​తో రూపొందుతోంది. ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. బాలీవుడ్​ భామ జాన్వీ కపూర్‌ తెలుగు తెరకు పరిచయమవుతున్నారు. సైఫ్‌ అలీఖాన్‌ విలన్​గా నటిస్తున్నారు. మరో కీలక పాత్రలో సీనియర్ నటుడు శ్రీకాంత్‌ నటిస్తున్నారు. మొదట ఈ చిత్రాన్ని ఏప్రిల్‌ 5న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్రయత్నాలు చేశారు. కానీ పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు మరింత ఆలస్యం అవ్వడం వల్ల సినిమా పోస్ట్ పోన్ అయింది. కానీ ఇంకా కొత్త విడుదల తేదీపై కూడా క్లారిటీ రాలేదు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

OTTలో మృణాల్ ఠాకూర్ సూపర్ హిట్​ సినిమా - 10 రోజుల్లోనే షూటింగ్ పూర్తి!

రజనీ 'లాల్ సలామ్' షాకింగ్ కలెక్షన్స్​ - మరీ ఇంత దారుణంగా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.