ETV Bharat / entertainment

పంద్రాగస్టు బాక్సాఫీస్​ పోరు - నివేదా '35' మూవీ రిలీజ్ వాయిదా! - Nivetha Thomas 35 Movie - NIVETHA THOMAS 35 MOVIE

Nivetha Thomas 35 Movie : నివేదా థామస్​ లీడ్​ రోల్​లో తెరకెక్కుతున్న '35' మూవీ రిలీజ్ డేట్​లో మార్పులు జరగనుందట. ఇంతకీ ఏమైందంటే?

Nivetha Thomas 35 Movie
Nivetha Thomas (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jul 28, 2024, 9:47 AM IST

Nivetha Thomas 35 Movie : గత కొంతకాలంగా సిల్వర్ స్క్రీన్​పై కనిపించని మలయాళ స్టార్ హీరోయిన్ నివేదా థామస్ తాజాగా '35' అనే ఫ్యామిలీ డ్రామాతో ప్రేక్షకులను పలకరించేందుకు రెడీగా ఉంది. 'చిన్న కథ కాదు' అనే క్యాఫ్షన్​తో రూపొందిన ఈ చిత్రం త్వరలో థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమైంది. ఇప్పటికే విడుదలైన టైటిల్ రివీల్ వీడియో, ట్రైలర్​ మూవీ లవర్స్​ను తెగ ఆకట్టుకుంది. అయితే ఇప్పుడీ సినిమా రిలీజ్ పోస్ట్​పోన్ అయ్యే సూచనలు కనిపిస్తున్నట్లు సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది.

తొలుత ఈ చిత్రాన్ని ఆగస్టు 15న విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేశారు. అందుకు తగ్గట్లుగానే డేట్ ఫిక్స్ చేసి అనౌన్స్​ కూడా చేశారు. అయితే ఇప్పుడీ రిలీజ్ డేట్​లో మార్పులు జరగనున్నాయట. దానికి కారణం బాక్సాఫీస్ క్లాష్​ అని తెలుస్తోంది. ఇప్పటికే అదే రోజున రవితేజ 'మిస్టర్ బచ్చన్'తో పాటు రామ్ పోతినేని 'డబుల్ ఇస్మార్ట్‌' థియేటర్లలోకి రానుంది. దీంతో '35' రిలీజ్​ను పోస్ట్​పోన్​ చేసేందుకు మేకర్స్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఒకవేళ ఇది నిజమైతే త్వరలోనే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశాలున్నాయట.

ఇక '35' సినిమా విషయానికి వస్తే, ఇది తిరుపతి నేపథ్యంలో సాగే ఓ ఫ్యామిలీ ఎమోషనల్ మూవీ. ఇందులో నివేదాతో పాటు ప్రియదర్శి, విశ్వదేవ్ రాచకొండ, అలాగే సినీయర్ నటులు గౌతమి, భాగ్యరాజ్ కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. స్టార్ హీరో రానా సమర్పకుడిగా వ్యవహరిస్తున్న ఈ చిత్రాన్ని నందకిశోర్‌ ఇమాని డైరెక్ట్ చేశారు. ఇక సురేశ్​ ప్రొడక్షన్స్, ఎస్ ఒరిజినల్స్​తో పాటు వాల్టెయిర్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై సృజన్ యరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి ఈ మూవీని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వివేక్ సాగర్ ఈ సినిమాకు చక్కటి సంగీతం అందిస్తున్నారు. తెలుగు, తమిళంతో పాటు మలయాళంలోనూ ఈ సినిమా విడుదల కానుంది.

2002లో మలయాళ చిత్రం 'ఉత్తర'తో బాలనటిగా నివేదా థామస్​ తెరంగ్రేటం చేసింది. 2016లో 'జెంటిల్‌మెన్‌' చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయమైంది​. ఆ తర్వాత 'నిన్నుకోరి', 'జై లవకుశ', 'జూలియట్‌ లవర్‌ ఆఫ్‌ ఇడియట్‌', '118', 'బ్రోచేవారెవరురా' 'వి', 'వకీల్​ సాబ్' లాంటి తెలుగు సినిమాల్లో నటించి ఇక్కడి ప్రేక్షకులకు దగ్గరైంది. చివరిగా రెజీనా కసాండ్రాతో 'శాకినీ ఢాకినీ' సినిమాలో కీ రోల్​ ప్లే చేసింది.

బుల్లితెరపై రాణించి వెండితెరపై అదరగొట్టి!

'నా ఎదుగుదలకు కారణం అలాంటి సవాళ్లే'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.