ETV Bharat / entertainment

'భారీ బడ్జెట్ అయినా నో చెప్తాను - ఆ పాత్రలపై నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు' - NITHYA MENEN INTERVIEW

అటువంటి సినిమాలకు నేనెప్పుడూ ఓకే చెప్పను : నిత్యా మేనన్‌

Nithya Menen Interview
Nithya Menen (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 22, 2024, 8:44 AM IST

Nithya Menen About Choosing Roles : క్యూట్ లుక్స్​తో, ఆకట్టుకునే నటనతో ఆడియెన్స్​ను అలరిస్తోంది స్టార్ హీరోయిన్​ నిత్య మేనన్​. కెరీర్‌ ప్రారంభం నుంచి నటనకు ప్రాధాన్యమున్న పాత్రలను ఎంచుకుంటూ వచ్చిన ఆమె, ఆయా పాత్రలకు తగ్గట్లుగా మారిపోయి ఎన్నో అద్భుతమైన విజయాలను తన ఖాతాలో వేసుకుంది. ఇటీవల జరిగిన 70వ నేషనల్ అవార్డ్స్​లో ఉత్తమ నటిగా పురస్కారాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన సినిమా ఎంపికల గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

"నాకు నేషనల్ అవార్డు వస్తుందని అస్సలు ఊహించలేదు. ప్రతి పాత్రకు గుర్తింపు రావాలని కూడా కోరుకోలేదు. ఎందుకంటే నేను ఎంచుకున్న రంగం అలాంటిది మరి. నేను పోషించిన పాత్ర నాకు సంతోషాన్నిస్తే చాలని అనుకున్నాను. దాన్ని దృష్టిలో పెట్టుకొనే ఇప్పటివరకూ ఆయా పాత్రలను ఎంపిక చేసుకున్నాను. భారీ బడ్జెట్‌తో తీసే మసాలా సినిమాల్లో అవకాశం వచ్చినా కూడా నేను నో చెప్పేస్తాను. అలాంటి పాత్రలంటే నాకు పెద్దగా ఆసక్తి ఉండదు. మంచి పాత్ర అయితే చిన్న సినిమాకైనా సరే నేను ఓకే చెప్తాను. అది ఎప్పుడు ప్రారంభమవుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తుంటాను. అందరూ అనుసరిస్తున్న మార్గంలోనే నేను కూడా వెళ్లాలన్న రూల్‌ లేదు కదా" అని చెప్పుకొచ్చింది.

ఇక నిత్యమేనన్​కు నేషనల్ అవార్డు తెచ్చిపెట్టిన సినిమా 'తిరు'(తిరుచిత్రంబలం). ఇందులో ధనుశ్​, రాశీ ఖన్నా కూడా కీలక పాత్రలు పోషించారు. 2022లో వచ్చిన ఈ చిత్రం అటు తమిళంతో పాటు ఇటు తెలుగు ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంది. ఇందులో నిత్యా మేనన్ నటనకు గతంలోనే మంచి మార్కులు పడ్డాయి.

కుటుంబ బంధాల మధ్య ప్రేమ ఆప్యాయతల నేపథ్యంలో విడుదలైన ఈ చిత్రం మిత్రన్ జవహర్ డైరెక్ట్ చేశారు. ప్రస్తుతం ఆమె పాండిరాజ్‌ తెరకెక్కిస్తున్న ఓ సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఆమె విజయ్‌ సేతుపతితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు. అలాగే 'గోల్డెన్‌ వీసా' అనే మరో చిత్రంలోనూ ఆమె కనిపించనున్నారు. దీనితో పాటు ధనుశ్​తో 'ఇడ్లీకడై' అనే చిత్రం చేస్తున్నారు.

నా కష్టానికి ప్రతిఫలం ఈ జాతీయ పురస్కారం : హీరోయిన్ నిత్య మేనన్‌

ఆ విషయం చెప్పగానే పవన్ ఆశ్చర్యపోయారు: నిత్యామేనన్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.